Lucky zodiac signs: ఉదయించబోతున్న రెండు గ్రహాలు.. ఐదు రోజుల తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది-mercury and venus rise in mithuna rashi after five days three zodaic signs get luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: ఉదయించబోతున్న రెండు గ్రహాలు.. ఐదు రోజుల తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది

Lucky zodiac signs: ఉదయించబోతున్న రెండు గ్రహాలు.. ఐదు రోజుల తర్వాత ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది

Gunti Soundarya HT Telugu
Jun 22, 2024 02:03 PM IST

Lucky zodiac signs: మిథున రాశిలో రెండు గ్రహాలు మరికొద్ది రోజుల్లో ఉదయించబోతున్నాయి. దీని వల్ల ఐదు రోజుల తర్వాత మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. డబ్బు చేతికి రావడంతో వీరి ఆనందానికి అవధులు ఉండవు.

ఉదయించబోతున్న రెండు గ్రహాలు
ఉదయించబోతున్న రెండు గ్రహాలు

Lucky zodiac signs: ప్రస్తుతం గ్రహాల రాకుమారుడు బుధుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు గత కొద్ది రోజుల నుంచి అస్తంగత్వ దశలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో శుక్ర, బుధ గ్రహాలు ఉదయించబోతున్నాయి.

తెలివితేటలు, తర్కం, వాక్కు వంటి వాటికి బుధుడు కారకుడు. ప్రేమ, వైవాహిక జీవితం, ఆకర్షణ, అందానికి బాధ్యుడు శుక్రుడు. ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో ఉదయించబోతున్నాయి. ఏడాది తర్వాత బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల శుభకరమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. జూన్ 27న బుధుడు ఉదయిస్తాడు. దృక్ పంచాంగ్ ప్రకారం సుమారు 66 రోజుల తర్వాత జూన్ 29న శుక్రుడు ఉదయించబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో మిథునంలో బుధుడు, శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులు అవుతారు. మిథునరాశిలో శుక్ర, బుధ గ్రహాల సంచార స్థితి మారడం వల్ల ఏ రాశి వారికి అదృష్టం కలిసిరాబోతుందో తెలుసుకుందాం.

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సమయంలో బుధుడు, శుక్రుడు ఉదయించడం వల్ల ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. ఆదాయం పెరగడం వల్ల ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. ఈ సమయం పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు. అనేక మార్గాల నుంచి డబ్బు వస్తుంది. అప్పుల నుండి విముక్తి పొందగలుగుతారు. మీరు కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయం పెట్టుబడికి కూడా అనుకూలమైనదిగా ఉంటుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి శుక్ర, బుధ గ్రహాల సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహాల అనుకూల ప్రభావం వల్ల వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. జీవితంలో వస్తున్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒత్తిడి లేకుండా, సంతోషంగా ఉండటానికి ప్రకృతిలో సమయాన్ని వెచ్చించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ జీవితం పూల పాన్పు మాదిరిగా ఉంటుంది. శుక్రుడి శుభ ప్రభావంతో ప్రేమలో పడతారు. మనసులో ఎటువంటి విషయాలు దాచుకోకుండా ఎదుటివారి ముందు వ్యక్తపరుస్తారు. భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. కీలకమైన విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.

మిథున రాశి

బుధుడు ఈ రాశికి అధిపతిగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు ఉదయించడం వల్ల మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మీ మనస్సును ఆధ్యాత్మికత వైపు మళ్లించడం వల్ల మంచి జరుగుతుంది. దైవిక ఆశీర్వాదాలు పొందుతారు. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో అద్భుతమైన కాలాన్ని అనుభవిస్తారు. భాగస్వామికి అమితమైన ప్రేమను అందిస్తారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన వీళ్ళు ఎదుటి వారి భావాలను త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel