Rahu mercury conjunction: 18 సంవత్సరాల తర్వాత అద్భుతాలు చేయబోతున్న రాహు, బుధ కలయిక
Rahu mercury conjunction: దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాహువు, బుధుడు కలయిక జరిగింది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి.

Rahu mercury conjunction: రెండు రోజుల క్రితం గ్రహాల రాకుమారుడుగా పరిగణించే బుధుడు మీన రాశి ప్రవేశం చేశాడు. అప్పటికే అక్కడ రాహువు సంచరిస్తున్నాడు. బుధుడు ప్రవేశించిన వెంటనే రాహువు, బుధుడు కలయిక ఏర్పడుతుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సంయోగం ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు గ్రహాలు కలయిక కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మార్చి 25 వరకు ఈ రెండు గ్రహాల కలయిక ఉంటుంది. మీనరాశిలో బుధుడు రాహువు కలయిక ఏ ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
మీన రాశిలో బుధుడు సంచారం కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి పెట్టుబడుదారులు దొరుకుతారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మాటల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. కెరీర్ ఎదుగుదలకు అనేక మార్గాలు తారసపడతాయి.
వృశ్చిక రాశి
బుధ, రాహు కలయిక వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ కి వెళ్తారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది.
సింహ రాశి
బుధుడు శుభ ప్రభావంతో సింహ రాశి వాళ్ళు చేపట్టిన పలు ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో తీసుకుని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయం అనువైనది.
బుధ రాహు కలయికతో వల్ల జడత్వ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అశుభ యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని ప్రభావంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ ఏ రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయో చూద్దాం.
మిథున రాశి
రాహు, బుధ సంయోగం మిథున రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఆరోగ్యం నుండి మొదలుకొని జీవితంలో అనేక విషయాలలో అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాపారం లేదా ఉద్యోగం కూడా ప్రభావితం అవుతుంది. వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్లు నష్టాలను చూడాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి.
కన్యా రాశి
కన్య రాశికి కూడా బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ రాశి ఏడో ఇంట్లో బుధుడు బలహీనంగా ఉండటం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ సమయంలో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకపోవడం మంచిది.
బుధుడు స్థానం బలపరిచేందుకు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించాలి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఇంట్లో ఆడవారిని గౌరవించాలి. బుధుడిని శాంతింప చేసేందుకు బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులు దానం చేయాలి. బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపారంలో విజయాలు పొందుతారు.