గురు-బుధుల సంయోగంతో త్రికోణ యోగం.. ఈ 3 రాశులకు కాసుల వర్షం.. పట్టిందల్లా బంగారం!-mercury and jupiter forms trikona yogam and these 3 rasis will get lots of wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గురు-బుధుల సంయోగంతో త్రికోణ యోగం.. ఈ 3 రాశులకు కాసుల వర్షం.. పట్టిందల్లా బంగారం!

గురు-బుధుల సంయోగంతో త్రికోణ యోగం.. ఈ 3 రాశులకు కాసుల వర్షం.. పట్టిందల్లా బంగారం!

Peddinti Sravya HT Telugu

గురు, బుధుల సంయోగం వల్ల ఏర్పడే త్రికోణ యోగం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశులకు ధనవృద్ధిని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.

గురు-బుధుల సంయోగంతో త్రికోణ యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక చాలా ముఖ్యమైనది. రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలిసినప్పుడు శుభ అశుభ ఫలితాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దాని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.

ఆ విధంగా మే 5వ తేదీన నవగ్రహాలలో రాకుమారుడిగా పేరుగాంచిన బుధుడు, గురువు 60 డిగ్రీల దూరంలో ఉంటారు. దీని వల్ల త్రికోణ యోగం ఏర్పడుతుంది. గురు, బుధుల సంయోగం వల్ల ఏర్పడే త్రికోణ యోగం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశులకు ధనవృద్ధిని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులు వారు ఎవరో చూసేద్దాం.

త్రికోణ యోగంతో ఈ రాశులకు బోలెడు లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి గురు, బుధుల వల్ల ఏర్పడే త్రికోణ యోగం అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులుతో మంచి లాభాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుతారు. ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.

స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ధనయోగం ఉంటుంది అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గురు, బుధ త్రికోణ యోగం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కాలంలో మీకు ఇతరుల నుండి గౌరవం, మర్యాద పెరుగుతాయి. కొత్త బాధ్యతల వల్ల మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్ పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.

కొత్త స్నేహితుల వల్ల మీ ఆనందం పెరుగుతుంది. సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు మీకు లభిస్తాయి. ధనయోగం మీ వెంట ఉంటుంది. అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.

3.మకర రాశి

మకర రాశి వారికి గురు బుధ త్రికోణ యోగం కలిసి వస్తుంది. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు మీకు అభివృద్ధిని కలిగిస్తాయని, వ్యాపారంలో వస్తున్న సమస్యలు తగ్గి ఒప్పందాలు మీకు అనుకూలంగా ముగుస్తాయని తెలుస్తోంది.

కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని, వివాహితుల జీవితంలో సంతోషం పెరుగుతుందని తెలుస్తోంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి. అకస్మాత్తుగా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ధన యోగం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం