Men Not Allowed : ఈ ఆలయాల్లో పురుషులకు నో ఎంట్రీ.. మహిళలకు మాత్రమే అనుమతి
Men Not Allowed Temple In India : ఇండియాలో కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదు. ఆ ఆలయాలు ఏంటో తెలుసుకోండి.

భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం లేదని మీరు వినే ఉంటారు.. కానీ పురుషులను అనుమతించని ఆలయాలు కూడా ఉన్నాయి. ఏ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు అక్కడ ప్రవేశం లేదో తెలుసుకోండి..
అట్టుకల్ దేవాలయం
కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని అట్టుకల్ దేవాలయం. వార్షిక పండుగలు, ఊరేగింపులలో మహిళలు మాత్రమే పాల్గొంటారు. ఈ ఆలయంలో లక్షలాది మంది మహిళలు పాల్గొన్న పొంగల్ పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ పండుగ ఏదైనా మతపరమైన కార్యకలాపాల కోసం అత్యధికంగా మహిళలు గుమిగూడే పండుగగా పరిగణిస్తారు. ఇక్కడ స్త్రీలు అమ్మవారికి కంకణాలు ధరిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వారం రోజుల పాటు నారీ పూజ జరుగుతుంది. మహిళలు వారం రోజుల పాటు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు గుడిలో స్త్రీలు మాత్రమే ఉండాలి. పురుషులు ఉండకూడదు.
శ్రీ భగవతి ఆలయం
శ్రీ భగవతి ఆలయం కేరళ రాష్ట్రంలోని అలప్పుజకు ఆగ్నేయంగా 30 కి.మీ దూరంలో ఉంది. దుర్గాదేవిని పూజిస్తారు. ప్రసిద్ధ నదులు పంపా, మణిమాల ఆలయానికి ఇరువైపులా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక వారం పాటు పూజలు జరుగుతాయి. అప్పుడు గుడిలో స్త్రీలు మాత్రమే ఉండాలి. పురుషులు ఉండకూడదు. మహిళలు వారం రోజుల పాటు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించడం ఆనవాయితీ.
భగాది మాత ఆలయం
భగాది మాత ఆలయం.. దేశంలోని 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఇది కన్యాకుమారిలో అతి ముఖ్యమైన దేవాలయం. ప్రధాన దేవత దుర్గాదేవి. తల్లిని భగవతీ మాత అంటారు. ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. బ్రహ్మచారులు లేదా సన్యాసులు మాత్రమే ఆలయ ద్వారం వరకు ప్రవేశించడానికి అనుమతిస్తారు. వివాహిత పురుషులను ప్రాంగణంలోకి అనుమతించరు. పార్వతీమాత శివుడిని పెళ్లాడాలని తపస్సు చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు.
సంతోషి మాత దేవాలయం
సంతోషి మాత దేవాలయం ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. సంతోషి మాత ఆలయం కన్యల వ్రత ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో పురుషులకు వారానికి 6 రోజులు అనుమతి ఉంటుంది. ఈ ఆలయంలోకి శుక్రవారం మాత్రమే పురుషులకు ప్రవేశం నిరాకరిస్తారు. ఈ ఆలయంలోకి పురుషులను అనుమతించినప్పటికీ, వారు చాలా కఠినమైన నియమాలను పాటించాలి. మగవాళ్ళు ఎవరూ ఇక్కడికి రారు.
బ్రహ్మ ఆలయం
బ్రహ్మ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అరుదు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో అలాంటి దేవాలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. కారణం ఏమిటంటే బ్రహ్మ యాగం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, సరస్వతీ దేవి అతని పక్కన లేదు. బ్రహ్మ గాయత్రి అనే అమ్మాయిని వివాహం చేసుకుని యాగాన్ని పూర్తి చేస్తాడు. తిరిగి రాగానే సరస్వతికి విషయం తెలిసి ఆమెను శపించింది. ఆ కోపం కారణంగానే ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం లేదు. అలా చేస్తే దాంపత్య సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. అందుకే మగవాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సాహసించరు.