శరీర భాగాల నిర్మాణం, గుర్తులు, రంగు, పుట్టుమచ్చలు మొదలైన వాటి బట్టి శుభ, అశుభ సంకేతాల గురించి సాముద్రిక శాస్త్రం చెబుతుంది. సాముద్రిక శాస్త్రం వ్యక్తి ఆర్థిక పరిస్థితి, వృత్తి, వైవాహిక జీవితం, ఆరోగ్యం ఎలా ఉంటాయన్నది కూడా చెప్తుంది.
సాముద్రిక శాస్త్రం మనకి ఎంతవరకు అదృష్టం ఉంది వంటి విషయాలను కూడా వివరంగా చెబుతుంది. అత్యంత పవిత్రమైన సంకేతాల గురించి చూస్తే – అరచేతుల్లో చక్రం, చేప, ధ్వజం, శంఖం ఉన్నట్లయితే ఆ వ్యక్తులు కీర్తి, సంపదను పొందుతారు.
కమలం, చక్రం అరికాలి పై ఉంటే ఆ వ్యక్తి ప్రజాధారణను పొందుతాడు. వీళ్ళు ఆధ్యాత్మికంలో, రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి, ప్రతిష్ఠలను పొందగలరు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.