శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేక పోతారు.
15.5.25 నుండి 19.10.25 వరకు, తిరిగి 6.12.25 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసిక ఆందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
19.5.25 నుండి సంవత్సరం వరకు కుంభంలో ఉంటాడు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగుట మంచిది.
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచివుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులను కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది. అన్నివిషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
బృహస్పతి మే నుండి నాలగవ స్థానములో, శని ఒకటవ (జన్మరాశినందు) (ఏలినాటి శని) స్థానమునందు సంచరించుట చేత, రాహువు మే నుండి పన్నెండవస్థానము, కేతువు మే నుండి ఆరవ స్థానమునందు సంచరించుట చేత మీన రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను అందిస్తుంది.
మీన రాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం వలన పనులలో ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాలలో కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలి. ప్రతీ పనీ సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయ స్థానములో రాహువు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయము జరుగును. మీన రాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు అధికమగును.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం నిత్యము గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టములు, శారీరక అనారోగ్యములు. ప్రతి విషయములో బద్ధకము. వ్యవసాయ, చేతి వృత్తుల వారికి అనుకూలం. ఆస్తి గొడవలుంటాయి. ఊహించని వారితో పరిచయాలుంటాయి. గృహ కలహములు. ప్రయాణ సమయంలో ఆటంకాలు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆనందము, బంధువుల రాక, ఇతరులతో అభిప్రాయ బేధము ఏర్పడుము. ఆరోగ్యంలో ఔషధ సేవలు. మీరు ఇతరులను దూషిస్తారు. సంతాన పరంగా ఆలోచన చేస్తారు. యంత్ర పరిశ్రమలు అభివృద్ధి. మీ అభివృద్ధికి నరఘోష. స్నేహ బాంధవ్యములు పెరుగును. గట్టిగా మాట్లాడతారు.
ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ధనము లభించును. శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసికానందం. ఆరోగ్యం అనుకూలించును. అశుభ సమాచారం. పరిచయస్తులకు సాయం చేస్తారు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం వ్యవహారముల కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. అనారోగ్యం. దేవాలయ దర్శనం, నూతన గృహ ఆలోచన చేస్తారు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో విందు, వినోదముల కొరకు ధనమును అధికముగా ఖర్చు చేయుదురు. అనుకున్న పనులు పూర్తి కావు. ఆగిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణముల ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అనుకూల సమయం. నూతన శుభకార్యములకు శ్రీకారం చుడతారు. ఆస్తుల సంక్రమణం. పెద్ద సమస్యలో వైఫల్యం. ప్రారంభములో మంచి లాభములు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. మానసికానందం.
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి కావు. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. ప్రయాణములు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూమి తగవులుంటాయి. సేవాకార్యాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమపరంగా అనుకూల సమయం.
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. ధనం వృథాగా ఖర్చు చేసెదరు. స్వల్పం ధన లాభముంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఇరుగు పొరుగువారితో గొడవలు. అధికార భయములు. కోర్టు వ్యవహారములు అనుకూలం.
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా లాభదాయకం. వ్యవసాయదారులకు అనుకూలం. బంధుమిత్రుల సహకారముంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలుంటాయి. మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు. వేడుకలు చేస్తారు.
ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన పనులు ప్రారంభిస్తారు. వాహన సౌఖ్యము. మానసిక ఆనందము. సోదరులతో విరోధములుంటాయి. గృహోపకరణముల మీద ఆసక్తి చూపుతారు. నూతన ఉద్యోగకాశములు వచ్చును. ధనపరంగా ఇబ్బందులు పడతారు. శారీరక అలసట.
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ప్రయాణములు చేస్తారు. పట్టుదల ప్రతి విషయంలోను ఉంటుంది. అదనపు రాబడి. వృత్తి వ్యాపారపరంగా లాభదాయకం. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాహన సౌఖ్యం లేకపోవుట. ఆర్థిక ఇబ్బందులు వచ్చును. భూ సంబంధిత మార్పులు కలసివచ్చును. కొంతమంది మిమ్ములను దూషించెదరు.
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడు సూచనలున్నాయి. మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. ఆలయ దర్శనం చేసుకుంటారు. మీరు సహాయం చేసినవారు వెను తిరుగుతారు. ఆడంబరాలకు ధన వ్యయం చేస్తారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
సంబంధిత కథనం