మే 15, నేటి రాశి ఫలాలు.. వీరికి శత్రువులే మిత్రులై ఆపన్న హస్తం అందిస్తారు-may 15th 2024 daily horoscope today rasi phalalu check your zodiac wise results in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 15, నేటి రాశి ఫలాలు.. వీరికి శత్రువులే మిత్రులై ఆపన్న హస్తం అందిస్తారు

మే 15, నేటి రాశి ఫలాలు.. వీరికి శత్రువులే మిత్రులై ఆపన్న హస్తం అందిస్తారు

HT Telugu Desk HT Telugu
May 15, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ15.05.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 15వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 15వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.05.2024

వారం: బుధవారం, తిథి : అష్టమి,

నక్షత్రం : ఆశ్లేష, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శ్రమకు తగిన ఫలితముంటుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. శత్రువులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలుంటాయి. సమస్యలు ఎదరైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలుంటాయి. విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయాలి. ఈరోజు వినాయకుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయ నివేదించడం, బెల్లమును నైవేద్యముగా సమర్పించడం వలన విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రముఖల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకూల సమయం. ధన వ్యయముంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. భగవద్గీత వినడం, చదవడం వల్ల, కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యముంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఉద్యోగస్తులకు నూతన పదోన్నతులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. అరోగ్యసమస్యలుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒక సమాచానం ఆనందం కలిగిస్తుంది. కుటుంబములో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలుంటాయి. రుణాలు చేయాల్సి ఉంటుంది. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. బంధువులతో ఆనందముగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఇబ్బందులు నుండి బయటపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని సమస్యలు తీరతాయి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులు విధులను సక్రమంగా నిర్వహిస్తారు. బంధువులతో అభిప్రాయ భేదాలేర్పడు సూచనలున్నాయి. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శ్రీకృష్ణుడిని పూజించాలి. కృష్ణాష్టకం పఠించాలి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో వివాదాలు తొలగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలుంటాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. ధనవ్యయముంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. మానసిక అందోళన. కుటుంబముతో ఒత్తిడులుంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో ధన లాభముంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూల సమయం. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహన, గృహ, భూ కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. బంధువుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయంలో ఇబ్బందులుంటాయి. వృధా ఖర్చులుంటాయి. వినాయకుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, వినాయక అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమస్యల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు తగ్గుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలం. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్గీత వినడం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. బంధువులతో అభిప్రాయ భేధాలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ప్రత్యర్థుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలలో అంత లాభాలు ఉండవు. విదేవీ పర్యటనలు వాయిదాపడతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయించుకోవడం అలాగే ఆలయదర్శనం చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబములో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వెంకటేశ్వరస్వామిని పూజించాలి. వెంకటేశ్వరస్వామి అష్టోత్తర శతనామావళి పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదవడం వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీచిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel