మే 12, నేటి రాశి ఫలాలు.. కోర్టు కేసుల్లో విజయం వీరిదే, సూర్యాష్టకాన్ని పఠించాలి-may 12th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 12, నేటి రాశి ఫలాలు.. కోర్టు కేసుల్లో విజయం వీరిదే, సూర్యాష్టకాన్ని పఠించాలి

మే 12, నేటి రాశి ఫలాలు.. కోర్టు కేసుల్లో విజయం వీరిదే, సూర్యాష్టకాన్ని పఠించాలి

HT Telugu Desk HT Telugu
May 12, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ12.05.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 12వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 12వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 12.05.2024

వారం: ఆదివారం, తిథి : పంచమి,

నక్షత్రం : ఆరుద్ర, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలించును. వ్యాపారస్తులకు లాభదాయకం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. వివాహ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం అనుకూలించును. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన విధంగా సఫలీకృతమగును. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారాల్లో పెట్టుబడికి తగిన లాభాలుంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్యపరంగా అనుకూలం. వృషభ రాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కలసివచ్చేటటువంటి రోజు. తొందరపాటు నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలుంటాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా శుభవార్తలుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలు పెరిగే అవకాశమున్నది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. ఆదాయపరంగా కలసివస్తుంది. వ్యాపారస్తులకు రాబడికి లోటుండదు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. స్నేహితులు సహకారం ఉంటుంది. సంతానపరంగా ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఏ విషయంలోను తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అన్ని బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకుంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి కొన్ని ప్రణాళికలు వేస్తారు. కొన్ని కుటుంబ బాధ్యతలు మీకు అప్పగిస్తారు. మీరు చేసిన పనికి అందరూ చాలా సంతోషంగా కనిపిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని విషయాలలో ఇతరులతో మాట్లాడటం లేదా సంప్రదింపులు కలసివస్తాయి. ముఖ్యమైన పనులు, సంబంధాల గురించి ఆలోచిస్తారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలు తీరే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులు పనులపై ఏకాగ్రత వహిస్తారు. సహోద్యోగుల నుండి సహకారం పొందుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ వ్యాపారంలో డబ్బును పెట్టుబడి పెట్టేముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆచితూచి వ్యవహరించాలి. మీ పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. పెద్దలను గౌరవిస్తారు. కళారంగానికి సంబంధించినవారు మంచి లాభాలను పొందుతారు. పిల్లల కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీరు కెరీర్‌కు సంబంధించి కొత్త అవకాశాలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో సోదరుల నుండి సహకారం పొందుతారు. మీ పిల్లలతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వ్యాపారాలు ఎవరి భాగస్వామ్యం లేకుండా విజయవంతంగా అనుకూల ఫలితాలను సాధిస్తారు. భూమి సంబంధమైన విషయాలు అనుకూలం. ఉద్యోగస్తులకు సహాయ సహకారాలుంటాయి. విద్యార్థులకు అనుకూల సమయం. మీ మనోధైర్యం చాలా విజయాలకు కారణం అవుతుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అనుకూలం. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్ర నామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner