రేపే శని త్రయోదశి.. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.. ఇలా చేస్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!-may 10th is shani trayodashi check what to do and what we should not do on this auspicious day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రేపే శని త్రయోదశి.. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.. ఇలా చేస్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!

రేపే శని త్రయోదశి.. ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.. ఇలా చేస్తే సమస్యలన్నీ తీరిపోవచ్చు!

Peddinti Sravya HT Telugu

శని త్రయోదశి శని దేవుడికి, శివుడికి అంకితం చేయబడింది. శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. శని దేవుడు మంచి చేస్తే మంచి ఫలితాలను, చెడు చేస్తే చెడు ఫలితాలని ఇస్తాడు. శని త్రయోదశి నాడు దోషాలు ఉన్నవారు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. శని త్రయోదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి.

శని త్రయోదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

హిందూమతంలో శని త్రయోదశి ముఖ్యమైన పర్వదినం. ఈరోజు కొన్ని పరిహారాలని పాటించడం వలన విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. శని బాధల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

శని త్రయోదశి శని దేవుడికి, శివుడికి అంకితం చేయబడింది. శనీశ్వరుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. శని దేవుడు మంచి చేస్తే మంచి ఫలితాలను, చెడు చేస్తే చెడు ఫలితాలని ఇస్తాడు. శని త్రయోదశి నాడు దోషాలు ఉన్నవారు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. శని అనుగ్రహం కలగడంతో పాటుగా ఆరోగ్యం, ఆయుష్షు కూడా లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి.

శని త్రయోదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

శని త్రయోదశి నాడు చేయకూడని పనులు

  1. శని త్రయోదశి నాడు నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు. నలుపు రంగు శని రంగు. కనుక ఈరోజు నలుపు రంగు దుస్తులని ధరించవద్దు.
  2. శని దోషాన్ని కలిగించే పనులు చేయకూడదు. ఎవరినైనా అవమానించడం వంటివి చేస్తే శని దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  3. శని త్రయోదశి నాడు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే శని దేవుడికి ఆగ్రహం కలుగుతుంది.
  4. శని దేవుడు సత్యదేవుడు. శనిదేవుడుకి అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. కాబట్టి శని త్రయోదశి నాడు అబద్దాలు కూడా చెప్పడం మంచిది కాదు.
  5. ఒకరి గురించి చెడుగా మాట్లాడితే కూడా శనీశ్వరుడికి కోపం వస్తుంది. కాబట్టి అలంటి పనులు చేయకండి.
  6. మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ఏ శని దోషాలు ఎక్కువవుతాయి.
  7. కాళ్లతో, పాదాలతో ఇతరులని తాకడం, తన్నడం వంటివి చేస్తే కూడా శని దోషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  8. ఇనుము వస్తువులని శనీశ్వరుడికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు ఇనుము వస్తువులను దానం చేయకండి.

శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

  1. రావి చెట్టుకు ఈరోజు నీరు అందిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది.
  2. ఈరోజు నువ్వులని దానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
  3. శనీశ్వరుడిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం వలన మంచి ఫలితం ఉంటుంది.
  4. పేదలకు ఆహారం అందిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
  5. శని చాలీసా పఠిస్తే కూడా ఉత్తమ ఫలితాన్ని పొందడానికి అవుతుంది.
  6. ఈరోజు హనుమంతుడిని పూజిస్తే కూడా చాలా మంచిది.

శని త్రయోదశి ప్రాముఖ్యత

శని త్రయోదశి నాడు శని దోషంతో బాధపడేవారు ఉపవాసం ఉంటే మంచిది. అలా చేయడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు. సుఖశాంతులు కలుగుతాయి. శనీశ్వరుడు అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.