మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, పుష్య మాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29న బుధవారం వస్తోంది. మత సంప్రదాయం ప్రకారం, పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం వలన పుణ్యం కలుగుతుంది. అలాగే మౌని అమావాస్య నాడు దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మౌని అమావాస్యనాడు పూర్వికులకి తర్పణం, పిండ ప్రధానం, దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. వీటికి సంబంధించిన ముఖ్య విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అమావాస్య తిథి 28 జనవరి 2025 రాత్రి 7:35 నుంచి 29 జనవరి 2025 సాయంత్రం 6:05 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం 29 జనవరి 2025 ఉదయం 5:25 నుంచి ఉదయం 6:18 వరకు వుంది.
మౌని అమావాస్యనాడు సూర్యాస్తమయం తర్వాత అంటే ప్రదోషకాలంలో పూర్వీకులకు దీపాలను వెలిగిస్తే విశేష పలితాలని పొందవచ్చు. సూర్యాస్తమయం సాయంత్రం 5:58కి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సమయం తర్వాత పూర్వికులకు దీపాలను వెలిగించవచ్చు.
ఈ దీపం రాత్రి అంతా వెలిగేటట్టు చూసుకోండి. కావాలంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయొచ్చు. మీ పూర్వీకుల ఫోటో ఉంటే వారి ఫోటో ముందు కూడా దీపారాధన చేయొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం