Mars Transit: షడష్టక యోగం.. ఈ 4 రాశులకు అశుభ ఘడియలు
కుజ గ్రహ సంచారం వల్ల కలిగే షడష్టక యోగ ప్రభావం అనేక రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కుజ గ్రహ సంచారం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది.
షడష్టక యోగం పలు రాశుల జాతకులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తత్ఫలితంగా వారు అశుభ ఫలితాలు పొందుతారు. కుజుడు మే 10న కర్కాటక రాశిలోకి సంచరించాడు. శని కుంభ రాశిలో ఉన్నాడు. ఇలా కుజుడు ఈ కాలంలో శని నుంచి ఆరో స్థానంలో ఉన్నాడు. జ్యోతిష శాస్త్రంలో కుజుడు, శనిని శత్రువులుగా భావిస్తూ ఈ కలయికను షడష్టక యోగంగా పరిగణిస్తారు. జూన్ 30 వరకు కుజుడు కర్కాటకంలో ఉంటాడు. అప్పటి వరకు ఈ యోగం పలు రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. నాలుగు రాశుల వారు పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నాలుగు రాశులేవో ఇక్కడ తెలుసుకోండి.
కర్కాటక రాశిపై షడష్టక యోగ ప్రభావం
కర్కాటకంలో కుజుడు ఉండడం వల్ల కర్కాటక రాశి జాతకుల జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ జీవితంలోని ఆర్థిక విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టరాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
సింహరాశి వారిపై షడష్టక యోగం ప్రభావం
సింహ రాశి జాతకులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. పని చేసే చోట అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వివాదాలను నివారించడానికి ప్రయత్నించినప్పటికీ మీరు ఇందులో విఫలమవుతారు. మీ ఖర్చులు పెరుగుతాయి. దీని ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది.
ధనుస్సు రాశి వారిపై షడష్టక యోగ ప్రభావం
ధనుస్సు రాశి వారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి కోసం నిపుణుల సలహా తీసుకోవాలి. మీకు అత్యంత సన్నిహితుల చేతిలో మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
కుంభ రాశి వారిపై షడష్టక యోగ ప్రభావం
కుంభ రాశి జాతకులు ఈ కాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు గాయపడే ప్రమాదం ఉంది. మీ పనులను పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో పూర్తిచేయడం మంచిది. ఇది కాకుండా, మీరు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి సమస్య ఎదుర్కోవచ్చు.