Mars transit: 41రోజుల పాటు ఈ రాశుల వారికి అదృష్టమే నడుస్తుంది.. సంపన్నులు కాబోతున్నారు-mars transit into aries from june 1st to next 41 days these zodiac signs get good results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: 41రోజుల పాటు ఈ రాశుల వారికి అదృష్టమే నడుస్తుంది.. సంపన్నులు కాబోతున్నారు

Mars transit: 41రోజుల పాటు ఈ రాశుల వారికి అదృష్టమే నడుస్తుంది.. సంపన్నులు కాబోతున్నారు

Gunti Soundarya HT Telugu
May 21, 2024 07:14 PM IST

Mars transit: కుజుడి సంచారం వల్ల 41 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టమే నడుస్తుంది. అంగారకుడి ప్రభావంతో సంపన్నులు కాబోతున్నారు.

41 రోజుల పాటు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్న అంగారకుడు
41 రోజుల పాటు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్న అంగారకుడు

Mars transit: మంగళకరమైన కుజుడు త్వరలో తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న కుజుడు మరికొద్ది రోజుల్లో మేష రాశి ప్రవేశం చేస్తాడు.

మేష రాశికి అధిపతి అంగారకుడు. అటువంటి పరిస్థితుల్లో కుజుడి సంచారం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. జూన్ 1వ తేదీ నుంచి కుజుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 12 వరకు ఇదే రాశిలో ఉంటాడు. మేషం, వృశ్చిక రాశులకు కుజుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కుజ సంచార ప్రభావం కారణంగా 41 రోజుల్లో కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

మేష రాశి

కుజుడు తన సొంత రాశి అయిన మేష రాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం లభిస్తుంది. వ్యాపారులతో పాత పెట్టుబడులతో మంచి లాభాలు కలుగుతాయి. వృత్తిలో పనికి ప్రశంసలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాల వల్ల గౌరవం చాలా పెరుగుతుంది. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు చేసే పనికి ప్రశంసలు వస్తాయి. అనేక పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైన సమయం.

మిథున రాశి

కుజుడి సంచారంతో మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. కెరీర్ కి సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. ఫలితంగా మీ లక్ష్యాలని చేరుకుంటారు.

సింహ రాశి

సింహ రాశి వారికి ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం వరం కంటే తక్కువేమీ కాదు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా జీవిస్తారు

కన్యా రాశి

ఈ సమయంలో మీరు ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం శుభదాయకం.

ధనుస్సు రాశి

కుజుడు రాశి మార్పు ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనికి సంబంధించి విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది.

మీన రాశి

మీన రాశి వారికి కుజుడి సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయం వీరికి చాలా ఉత్పాదకంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం పాటించాలి.

 

 

WhatsApp channel