Mars Transit in Simha Rasi: 18 నెలల తర్వాత సింహ రాశిలో కుజుడు, ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. ఆర్థిక లాభం, పదోన్నతితో పాటు-mars transit in simha rasi these 3 zodiac signs will get golden days they may get wealth happiness and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit In Simha Rasi: 18 నెలల తర్వాత సింహ రాశిలో కుజుడు, ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. ఆర్థిక లాభం, పదోన్నతితో పాటు

Mars Transit in Simha Rasi: 18 నెలల తర్వాత సింహ రాశిలో కుజుడు, ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. ఆర్థిక లాభం, పదోన్నతితో పాటు

Peddinti Sravya HT Telugu

Mars Transit in Simha Rasi: కుజుడు 18 నెలల తర్వాత జూన్ నెలలో సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది 12 రాశులపైనా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని రాశులకు మంచి ఫలితాలు లభిస్తాయి.

18 నెలల తర్వాత సింహ రాశిలో కుజుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మంగళ గ్రహాలలో ఒకడు. నవగ్రహాల సేనాధిపతి. కుజుడు ఆత్మవిశ్వాసం, ధైర్యం, వీరత్వం, పట్టుదల, బలాన్ని ఇస్తుంది. కుజుడు రాశి, నక్షత్రాల స్థానం మారినప్పుడు అన్ని రాశులపైనా ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా 2025లో జరిగే కుజ సంచారం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.

కుజుడు 18 నెలల తర్వాత జూన్ నెలలో సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది 12 రాశులపైనా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని రాశులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ రాశులు ఏంటో చూద్దాం.

1.సింహ రాశి

కుజ సంచారం మీకు మంచి అభివృద్ధిని ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వ్యాపారంలో మీకు అనుకూలమైన సమయం అవ్వచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు, వాహనం కొనడానికి అవకాశాలు లభిస్తాయి. ఖ్యాతి శిఖరానికి చేరే అవకాశాలు మీకు వున్నాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. భూమికి సంబంధించిన వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉండవచ్చు. కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

2.తులా రాశి

తులా రాశి వారికి కుజ సంచారం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి అభివృద్ధి ఉంటుంది.

ప్రణాళికలు అన్నీ నెరవేరుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు వున్నాయి. ఇతరుల నుండి గౌరవం, మర్యాద పెరగవచ్చు. కొత్త ప్రయత్నాలు మంచి ప్రశంసలను అందిస్తాయి.

3.వృశ్చిక రాశి

కుజుడి సంచారం మీకు అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మీకు ఉద్యోగం, వ్యాపారంలో మంచి విజయం రావచ్చు. ప్రణాళికలు విజయవంతంగా ఉంటాయి. మీ జీవితంలో కొత్త ఒప్పందాలు లభిస్తాయి. అధిక డబ్బు సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. అధిక ఆదాయం పొందే అవకాశాలు వున్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం