Mars transit: అంగారకుడి సంచారం.. వీరికి ఇక కనక వర్షమే, డబ్బు ఆదా చేసుకుంటారు
Mars transit: అంగారకుడు త్వరలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈనెల 23వ తేదీన కుజుడు కుంభ రాశిని వీడి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కనక వర్షమే.
Mars transit: అసురుల అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. ధైర్యం, శక్తి, పరాక్రమం మొదలైన వాటికి అంగారకుడు కారకుడు. కుజుడిని మండుతున్న గ్రహంగా పిలుస్తారు. ఏప్రిల్ 23న అంగారకుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడి శుభ స్థానం వల్ల వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కుజుడి సంచారం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేపడతారు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు తన త్రికోణ రాశి అయిన మేష రాశిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు అందిస్తాడు. కుజుడి అనుగ్రహం లేకుండా వృత్తిలో మంచి ఫలితాలు పొందడం కష్టంగా ఉంటుంది. అంగరకుడి అనుగ్రహం ఉంటే జాతకులు తమ జీవితాల్లో అన్ని రకాల విలాసాలు పొందుతారు. సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం పొందుతారు. మీన రాశిలో కుజుడి సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
వృషభ రాశి
మీన రాశిలో కుజుడి సంచారం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. మీరు ఏదైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే అది ఈ సమయంలో పరిష్కారం అవుతుంది. డబ్బు సంపాదించడం వల్ల కుటుంబాల అవసరాలను తీర్చగలుగుతారు. కొత్త ఆదాయ వనరులు తారసపడతాయి. ఇవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. డబ్బు సంపాదించే విషయంలో అదృష్టం మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. పొదుపు చేయగలుగుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి కుజుడి సంచారం ఫలమంతమైన ఫలితాలు ఇస్తుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మీరు వేసుకునే భవిష్యత్తు ప్రణాళికలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వారి అవసరాలు తీర్చేందుకు రుణం తీసుకోవాల్సి రావచ్చు. అయితే ఈ సమయంలో రుణం తీసుకోవడంలోనూ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కర్కాటక రాశి
అంగారకుడి అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరపడిన వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కష్టపడి పనిచేయడంతో మనసు సంతృప్తిగా ఉంటుంది. మీ శ్రమ కారణంగా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
ధనుస్సు రాశి
అంగారకుడి సంచారంతో ధనుస్సు రాశి వారికి ధన ఇబ్బందులు ఉండవు. డబ్బు సంపాదించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక సహాయంతో కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెడతారు. అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలకు తోడు అదృష్టం అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ సమయం ఆర్థికపరంగా కలిసొస్తుంది. డబ్బులు సంపాదించేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. సంపద పెరుగుదలకు అవకాశాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అకడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు.