జూన్ 7 వరకు కుజుడు నీచ రాశిలో సంచారం.. 12 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు!-mars transit in karkataka rasi up to june 7th and these zodiac signs will get unexpected changes in life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 7 వరకు కుజుడు నీచ రాశిలో సంచారం.. 12 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు!

జూన్ 7 వరకు కుజుడు నీచ రాశిలో సంచారం.. 12 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు!

Peddinti Sravya HT Telugu

ప్రస్తుతం కుజుడు తన నీచ రాశియైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 07 జూన్ 2025 ఉదయం 02.28 గంటల వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపిస్తుంది. మరి ఏయే రాశుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం.

కుజుడి కర్కాటక రాశి సంచారంతో 12 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు

ప్రస్తుతం కుజుడు తన నీచ రాశియైన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 07 జూన్ 2025 ఉదయం 02.28 గంటల వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఆ తరువాత సింహ రాశిలో కుజుని సమాచారం 9 జూన్ 2025 సోమవారం రాత్రి 9:09 గంటల నుండి ప్రారంభమవుతుంది. 31 జులై 2025 గురువారం ఉదయం 6:09 గంటల వరకు సింహ రాశిలోనే ఉంటాడు.

ఆ తరువాత కుజుడు 31 జులై 2025 గురువారం ఉదయం 6:09 గంటలకు కన్యా రాశిలోకి ప్రవేశించి, 15 సెప్టెంబర్ 2025 సోమవారం రాత్రి 10:01 గంటల వరకు కన్యారాశిలో ఉంటాడు. తరువాత తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే కర్కాటక రాశిలో కుజుడి సంచారం 12 రాశులపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

కుజుడి కర్కాటక రాశి సంచారంతో 12 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు

మేష రాశి

మేష రాశి వారికి కుజుడి కర్కాటక రాశి సంచారంతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది. నివాసం లేదా పని ప్రదేశంలో మార్పు ఉంటుంది. పని ప్రదేశంలో పోటీతో పాటు అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి.

మిధున రాశి

ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఉండచ్చు. తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు. గౌరవం కోల్పోవచ్చు.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఆరోగ్యం, సంబంధాలలో అడ్డంకులు కలగవచ్చు. శత్రువులు బలంగా ఉంటారు. స్వభావంలో కోపం పెరుగుతుంది. మరమ్మత్తులపై ఖర్చు చేస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి అధిక ఖర్చు ఉండొచ్చు. సన్నిహిత మిత్రులు మరియు బంధువులతో విభేదాలు రావచ్చు. కుటుంబ కలహాలు ఉండొచ్చు. వైద్యుడిని సంప్రదించాల్సి రావచ్చు.

కన్య రాశి

ఈ రాశి వారికి కుజుడి కర్కాటక రాశి సంచారంతో ఆర్థిక లాభం. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అభివృద్ధి. గతంలో చేసిన కొన్ని పనులకు గౌరవం లభిస్తుంది.

తులా రాశి

తులా వారికి కుజుడి కర్కాటక రాశి సంచారంతో నివాసం లేదా పని ప్రదేశంలో మార్పు. ఆర్థిక లాభం. అధిక ఖర్చు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. పోటీతో కూడిన విజయం.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి చిన్న-పెద్ద ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు. ఆరోగ్య సమస్యలు. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అన్ని పనుల్లో అదనపు కృషి అవసరం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఆరోగ్యంలో ఇబ్బందులు రావచ్చు. అవాంఛనీయ మార్పులు ఉంటాయి. కుటుంబంలో ప్రమాదం, శస్త్రచికిత్స వంటివి ఉండొచ్చు. పనిలో అడ్డంకుల వల్ల నిరాశ కలగవచ్చు.

మకర రాశి

ఈ రాశి వారు కొత్త పనిలో పెట్టుబడి పెడతారు. కొన్ని పాత సంబంధాలలో ఒత్తిడి. గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయి.

కుంభ రాశి

రాశి వారు విజయం సాధిస్తారు. కొన్ని పాత ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. స్వయంగా లేదా ఇంటి సభ్యుల నివాసం లేదా పని ప్రదేశంలో మార్పు ఉండొచ్చు.

మీన రాశి

ఈ రాశి వారికి పోటీతో కూడిన విజయం ఉంటుంది. పని ప్రదేశంలో అభివృద్ధి. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. గతంలో చేసిన పనులకు గౌరవం లభిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం