కుజుడు ఈ నవరాత్రి సమయంలో రాశిని మార్చుకోబోతున్నాడు. మిధునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే, ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతోంది. కుజగ్రహం రాశి మార్పు వలన ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? ఏయే లాభాలను పొందవచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు కుజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. కుజ గ్రహం రాశి మార్పు వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతోంది? కుజుడు బుధుడు అధినేత అయినటువంటి మిధునం నుంచి కర్కాటకంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కుజుడు భూమి, రక్తం, ధైర్యం, శక్తి, శౌర్యం, యుద్ధానికి కారకుడు.
జ్యోతిష్యం ప్రకారం కుజుడు మిధున రాశి నుంచి కర్కాటకంలోకి ఈరోజు మారనున్నాడు. ఏప్రిల్ 3 మధ్యాహ్నం 1:35 కి కర్కాటకంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జూన్ 7 తర్వాత మళ్లీ రాశి మార్పు చేస్తాడు. అయితే, కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన ఏయే రాశుల వారికి బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశి వారికి కుజుడు రాశి మార్పు వలన అనేక లాభాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుండడంతో పాటుగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దుర్గాదేవి నుంచి ఆశీర్వాదం వస్తుంది. వ్యాపారస్తులకి కూడా లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది.
కుజుడు రాశి మార్పు కారణంగా కన్యా రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి సంతోషం ఉంటుంది. పూర్వికుల ఆస్తులు లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. కన్య రాశి వారు వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం