Mars transit: రేపటి నుంచి వీరికి సవాళ్ళతో కూడిన రోజులే.. ఇలా చేస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు-mars transit from tomorrow onwards these zodiac signs will get trouble in their career ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: రేపటి నుంచి వీరికి సవాళ్ళతో కూడిన రోజులే.. ఇలా చేస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు

Mars transit: రేపటి నుంచి వీరికి సవాళ్ళతో కూడిన రోజులే.. ఇలా చేస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు

Gunti Soundarya HT Telugu
May 31, 2024 09:25 AM IST

Mars transit: కుజుడు జూన్ 1వ తేదీ మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అందువల్ల రేపటి నుంచి కొన్ని రాశుల వారికి సవాళ్ళతో కూడిన రోజులు ఉండబోతున్నాయి. వాటి నుంచి బయట పడేందుకు కొన్ని మార్గాలు అనుసరిస్తే మంచిది.

రేపటి నుంచి వీరికి సవాళ్ళతో కూడిన రోజులు
రేపటి నుంచి వీరికి సవాళ్ళతో కూడిన రోజులు

Mars transit: అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. జూన్ 1 నుంచి అంగారకుడు మేష రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. కుజుడు 42 రోజులు పాటు ఇదే రాశిలో ఉండి జులై 12న వృషభ రాశిలో ఒక ప్రవేశిస్తాడు.

కుజుడి సంచారం అన్ని రాశుల వారిని ప్రభావితం చేసి ఆసక్తికరమైన యోగాలను సృష్టిస్తుంది. అంగారకుడి సంచార ప్రభావంతో ప్రజల జీవితాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కెరీర్లో విభిన్న సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొన్ని రాశుల వారికి లైఫ్ మారిపోతుంది. సంతోషంతో జీవితం సాగిపోతుంది. మేష రాశిలో కుజుడి సంచారం వల్ల ఈ రాశుల వారు కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభ రాశి

వృషభ రాశి ఏడు, పన్నెండో ఇంటికి అంగారకుడు అధిపతి. ఈసారి కుజుడు పన్నెండో ఇంట్లో సంచరిస్తాడు. ఇది వ్యక్తుల వృత్తి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వివిధ కార్యకలాపాలలో అదృష్టం అనుకూలంగా ఉండకపోవచ్చు. కార్యాలయంలో మీ పేరు ప్రఖ్యాతలు, కీర్తి బాగా తగ్గుతుంది. ఈ సమయం కాస్త కఠినంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా అందులో అవాంతరాలు ఎదురుకావచ్చు.

కన్యా రాశి

కన్యా రాశి మూడు, ఎనిమిదో ఇంటికి అంగారకుడు అధిపతి. ఈ సమయంలో ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. ఇది వారి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తుంది. వృత్తి జీవితంలో పురోభివృద్ధికి ఓపికగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పనికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే సహనంగా వ్యవహరించి సరైన సమయం కోసం వేచి చూడాలి. 42 రోజుల పాటు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తులా రాశి

తులా రాశి వారికి రెండు, ఏడో ఇంటికి అంగారకుడు అధిపతి. ఈసారి కుజుడు ఏడో ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా వీరికి వృత్తి జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తాడు. కార్యాలయంలో అధికారులు మీ శ్రమను గుర్తించినప్పటికీ సరైన అవకాశాలు రాకపోవచ్చు. ప్రమోషన్ వంటివి చేజారే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి మీకు ఎటువంటి సహాయం ఉండకపోవచ్చు.

మకర రాశి

మకర రాశి నాలుగు, పదకొండో ఇంటికి అంగారకుడు అధిపతి. ఈసారి కుజుడు మకర రాశి నాలుగో ఇంట్లో సంచరిస్తాడు. ఇది వారి కెరీర్ కి సమస్యగా ఉంటుంది. మేష రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల వీరికి సౌకర్యాలు తగ్గుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తిలో సంతృప్తి ఉండకపోవచ్చు.

కుజుడి సంచార ప్రభావం మెరుగుపరుచుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. అంగారకుడిని ప్రసన్నం చేసుకోవడానికి దాని అనుగ్రహం పొందటానికి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే స్నేహితులు, తోబుట్టువులు, అత్తమామలతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి.

మంగళవారం నాడు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు. అంగారక గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుడిని పూజించాలి. అలాగే నరసింహస్వామిని కూడా పూజించవచ్చు. సుందరకాండ పారాయణం చేయాలి. మంగళవారం నాడు ఉపవాసం ఉండి అంగారక గ్రహానికి సంబంధించిన వస్తువులు దానం చేయాలి.

WhatsApp channel