Hanuman jayanti: హనుమాన్ జయంతి నుంచి వీరికి ఇక తిరుగుండదు, సంపన్నులు కాబోతున్నారు-mars transit and hanuman jayanti gives get good luck prosperity on these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuman Jayanti: హనుమాన్ జయంతి నుంచి వీరికి ఇక తిరుగుండదు, సంపన్నులు కాబోతున్నారు

Hanuman jayanti: హనుమాన్ జయంతి నుంచి వీరికి ఇక తిరుగుండదు, సంపన్నులు కాబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Apr 20, 2024 07:00 PM IST

Hanuman jayanti: హనుమాన్ జయంతి నుంచి కొన్ని రాశుల వారి దశ తిరగబోతుంది. సంపన్నులు కాబోతున్నారు. వృత్తిపరంగా అనేక లాభాలు ఉంటాయి. ప్రమోషన్ లభిస్తుంది.

హనుమాన్ జయంతి నుంచి వీరికి ఇక తిరుగుండదు
హనుమాన్ జయంతి నుంచి వీరికి ఇక తిరుగుండదు (unsplash)

Hanuman jayanti: శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 మంగళవారం చైత్ర పౌర్ణమితో పాటు హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. 

జ్యోతిష్య శాస్త్రంలో మంగళవారం హనుమంతుడి ఆరాధనకు అంకితం చేసిన రోజు. అందువల్ల మంగళవారం, హనుమాన్ జయంతి కలిసి రావడంతో ఈరోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. హనుమాన్ జయంతి రోజు కుజ గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశి ప్రవేశం చేయబోతున్నాడు. హనుమాన్ జయంతి, కుజుడి సంచారం, చైత్ర పౌర్ణమి వంటి శుభకరమైన ఘట్టాలు ఏర్పడటంతో  కొన్ని రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నాలుగు రాశుల వారికి హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదాలతో పాటు కుజ గ్రహ అనుగ్రహం కూడా ఉండనుంది. ఈ రాశుల వారి అదృష్టం రెట్టింపు కాబోతోంది

వృషభ రాశి

హనుమాన్ జయంతి రోజే కుజుడు రాశి చక్రాన్ని మార్చుకోవడంతో వృషభ రాశి వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కష్టపడి పని చేసేందుకు మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకునేందుకు ఇది ఉత్తమ సమయం. వ్యాపార పరంగా అమితమైన లాభాలు గడిస్తారు. శత్రువులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మీ శక్తి సామర్థ్యాలతో విజయం సాధిస్తారు. 

తులా రాశి

కుజ సంచారం హనుమంతుడి అనుగ్రహంతో తులా రాశి జాతకులు అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. జీవితంలోని ప్రతి రంగంలో అపరమైన విజయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఈ సమయంలో భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. విదేశీ వనరుల నుంచి ఊహించని లాభాలు పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పనిలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 

ధనుస్సు రాశి

హనుమాన్ జయంతి నుంచి ధనుస్సు రాశి వారికి ధన సమస్యలు తొలగిపోతాయి. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. శ్రమకు ఫలితం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మీ అంకిత భావంతో ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కుతాయి. 

కుంభ రాశి

అనుకోని ఆదాయ మార్గాల ద్వారా కుంభ రాశి వారికి ధన లాభం కలుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో పురోభివృద్ధికి కనిపించే కొత్త అవకాశాలు మిమ్మల్ని సంతోషపెడతాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో లభించబోతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో అనేక మార్పులు మీ మనసుని సంతోషపెడతాయి. 

 

WhatsApp channel