Mars Transit: కుజ గ్రహ సంచారంతో ఈ 6 రాశులకు కష్టాలు.. డిసెంబరు 28 వరకు జాగ్రత్త
Mars Transit: కుజ గ్రహ సంచారం వల్ల పలు రాశుల జాతకుల జీవితాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. నవంబరు 16 నుంచి డిసెంబరు 28 వరకు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
వైదిక జ్యోతిష శాస్త్రంలో కుజ గ్రహ సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంగారకుడు (కుజుడు) ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తికి కారకుడు. ప్రతి గ్రహం ఒక నిర్ధిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి నవంబరు 16, 2023 గురువారం రోజు ప్రవేశించాడు. డిసెంబరు 28 వరకు ఈ రాశిలో ఉంటాడు. కుజ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల జాతకులు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. కానీ కొన్ని రాశుల జాతకులు ఒడిదుడులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆయా రాశులపై కుజుడి ప్రభావం ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
కుజ గ్రహ సంచారం వల్ల మేష రాశి జాతకులు వాహనాల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ పనిలో ఆటంకాలు ఉండవచ్చు. మీరు డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులకు గురవుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
కుజ గ్రహ సంచారం వల్ల మిథున రాశి జాతకులు ఇబ్బందులు పడుతారు. శత్రువుల వల్ల ఇబ్బంది ఉంటుంది. సన్నిహితుల చేతిలోనూ మోసపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. లేదంటే నష్టాలు ఎదురవవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి.
సింహ రాశి
సింహ రాశి వారు కుజ గ్రహ సంచారం కాలంలో ఆస్తి, మొదలైన వాటిపై పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భాగస్వామితో సంబంధంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కన్యా రాశి
కన్యా రాశి వారు అంగాకర సంచారం ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ పని ప్రాంతంలో శ్రమ అధికంగా ఉంటుంది. తోబుట్టువుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
తులా రాశి
కుజ గ్రహ సంచారం తులా రాశి జాతకులను ఇబ్బందులకు గురిచేస్తుంది. కుజ గ్రహ సంచారం వల్ల మీరు వృత్తిలో ఒడిదుడుకులు ఎదుర్కోవాలసి ఉంటుంది. సంపద సమీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సంభాషణలో సమతూకం పాటించాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ప్రశాంతత అలవరచుకోవాలి. సహనం పాటించేందుకు ప్రయత్నించాలి. ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. అనవసరమైన కోపాన్ని మానుకోండి. విద్యా సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.