Mars retrograde: గ్రహాల ప్రత్యక్ష సంచారం, తిరోగమనానికి జ్యోతిష్య శాస్త్రంలో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. నవగ్రహాలలో కేవలం ఏడు గ్రహాలు మాత్రమే తిరోగమన దశలో సంచరిస్తాయి. సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ తిరోగమన దశలో సంచరించారు. బుధుడు, కుజుడు, బృహస్పతి, శని, శుక్ర గ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత తిరోగమనంలో ప్రయాణిస్తాయి. రాహు కేతువులు మాత్రం ఎల్లప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తాయి.
నవగ్రహాలలో అంగారకుడిని శక్తి, ధైర్యానికి స్వరూపంగా భావిస్తారు. గ్రహాల అధిపతిగా పిలుస్తారు. ప్రస్తుతం కుజుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 45 రోజులకు ఒకసారి అంగారకుడు రాశిని మార్చుకుంటాడు. ఆగస్ట్ 26, 2024 సోమవారం నుంచి కుజుడు వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం కొన్ని నెలల తర్వాత కుజుడు తిరోగమనంలో సంచరిస్తాడు.
డిసెంబర్ 7, 2024 నుంచి కుజుడి తిరోగమనం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ఫిబ్రవరి 23, 2025 వరకు అంగారకుడు తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది. వృత్తిలో గొప్ప విజయాలు సాధిస్తారు. సంపదను కూడగట్టుకుంటారు. మానసిక స్థితి మెరుగుపడుతుంది. శక్తి, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మరికొన్ని రాశుల వారికి మాత్రం కష్టాలను ఇస్తుంది. అంగారకుడి తిరోగమనం ఏ రాశుల వారికి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి నాలుగో ఇంట్లో కుజుడు తిరోగమనంలో సంచరిస్తాడు. ఇది మీకు అనుకూలమైన కాలం అవుతుంది. భౌతిక సంతృప్తి పెరుగుతుంది. వాహనం లేదా ఇతర ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అదృష్టం మీ వైపు ఉండటం వల్ల అన్ని పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగం మారేందుకు ఇది మంచి సదావకాశం. ఉన్నత స్థానానికి వెళతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి.
కర్కాటక రాశిలోనే కుజుడి తిరోగమనం జరుగుతుంది. అందువల్ల ఈ రాశి వారి జీవితంలో అనేక శుభ, అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. బలం, ధైర్యం పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. తెలివితేటలతో ఎటువంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. ప్రముఖ, ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. వీళ్ళు భవిష్యత్ లో మీకు సహాయపడతారు. వివాహ బంధం సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం ఉంటుంది.
కుజుడు కన్యా రాశి లాభాల గృహంలో తిరోగమన దశలో సంచరిస్తాడు. ఈ సమయంలో అన్ని రంగాలలో సానుకూల విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ రాబడిలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. మునుపటి పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు పుష్కలంగా లభిస్తాయి. డబ్బును ఆదా చేయడంలోనూ విజయవంతం అవుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. పిల్లల నుంచి కొన్ని అద్భుతమైన వార్తలు పొందుతారు. ఆవివాహితులకు వివాహం కుదురుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధిస్తారు.