కన్యా రాశిలో కుజుడి తిరోగమనం.. ఈ 4 రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి-mars retrograde in virgo 4 signs to be wary ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Mars Retrograde In Virgo 4 Signs To Be Wary

కన్యా రాశిలో కుజుడి తిరోగమనం.. ఈ 4 రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Sep 22, 2023 11:37 AM IST

కన్యా రాశిలో కుజుడి తిరోగమనం ఉన్నందున 4 రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుజుడి తిరోగమనం కారణంగా 4 రాశులకు ప్రతికూల సమయం
కుజుడి తిరోగమనం కారణంగా 4 రాశులకు ప్రతికూల సమయం (pixabay)

వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, రాశుల మార్పు దైనందిన జీవితంపై, ప్రపంచ పరిణామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈనెలాఖరులో కుజుడు కన్యా రాశిలో తిరోగమనంలో పయనించనున్నాడు. ఈ కారణంగా మూడు రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆయా రాశుల వారు జాగ్రత్త పడాలి.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

కన్యా రాశిలో కుజుడు వక్రగమనంలో పయనిస్తున్నప్పుడు మేష రాశి వారికి కొంత అశుభ సమయంగా చెప్పొచ్చు. వీరికి పని చేసే చోట విభేదాలు తలెత్తుతాయి. సహోద్యోగులతో సంయమనం పాటించాలి. వృత్తిపరంగా ఎదురుదెబ్బలు తగలొచ్చు. ఉద్యోగార్థులకు ఉద్యోగం దొరకడం మరింత ఆలస్యం కావొచ్చు. వ్యాపారస్తులకు నష్టాలు పొంచి ఉన్నాయి. మేష రాశి జాతకులు కుటుంబ సమస్యలను ఓర్పుగా, నేర్పుగా, సంయమనంతో పరిష్కరించుకోవాలి. మాట తీరు తీయగా ఉండాలి.

వృషభ రాశి

కన్యా రాశిలో కుజుడు వక్రగమనంలో పయనిస్తున్నప్పుడు వృషభ రాశి జాతకులు ప్రతికూల ఫలితాలు చూస్తారు. చిన్నచిన్న పొరపాట్లు కూడా చినికి చినికి గాలివానలా మారుతాయి. ఉద్యోగం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడం మరింత ఆలస్యం కావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. సహనం, ఓర్పు చాలా అవసరం.

కర్కాటక రాశి

కన్యా రాశిలో కుజుడి తిరోగమనం కర్కాటక రాశి వారికి ప్రతికూల సమయం. ప్రయత్నాలు ఫలించకపోగా, ఎదురుదెబ్బలు తగులుతాయి. సహ ఉద్యోగులు, పై అధికారుల నుంచి సహకారం ఉండదు. ఉద్యోగ వేట ఫలించదు. ఓర్పుతో, సహనంతో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవాలి.

సింహ రాశి

కన్యా రాశిలో కుజ వక్రగమనం సింహ రాశి జాతకుల పనిలో ఒత్తిడి కలిగిస్తుంది. ఆందోళనకు గురవుతారు. వ్యాపారస్తులు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు అన్వేషించాలి. నమ్మకమైన వారి నుంచి సలహాలు తీసుకుని పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు.

WhatsApp channel