DhanaLakshmi Yogam:కుజుడి తిరోగమనంతో మూడు రాశుల వారికి ధనలక్ష్మీ యోగం.. మీరు అందులో ఉన్నారో లేదో తెలుసుకొండి-mars retrograde in cacer brings huge money and success for these three zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhanalakshmi Yogam:కుజుడి తిరోగమనంతో మూడు రాశుల వారికి ధనలక్ష్మీ యోగం.. మీరు అందులో ఉన్నారో లేదో తెలుసుకొండి

DhanaLakshmi Yogam:కుజుడి తిరోగమనంతో మూడు రాశుల వారికి ధనలక్ష్మీ యోగం.. మీరు అందులో ఉన్నారో లేదో తెలుసుకొండి

Ramya Sri Marka HT Telugu
Dec 07, 2024 10:30 AM IST

DhanaLakshmi Yogam: గ్రహాల అధిపతి కుజుడు డిసెంబర్ 7న అంటే నేడు కర్కాటక రాశిలోకి తిరోగమణం చెందాడు. కుజుడి తిరోగమన సంచారం మూడు రాశుల వారికి ధనలక్ష్మీ యోగాన్ని తెచ్చిపెట్టింది. ఈ రోజు నుంచీ వీరికి డబ్బుకి కొదవే ఉండదు. అందులో మీ రాశి కూడా ఉందా తెలుసుకొండి.

కుజుడి తిరోగమనంతో ఈ రాశుల వారికి ధనలక్ష్మీ యోగం
కుజుడి తిరోగమనంతో ఈ రాశుల వారికి ధనలక్ష్మీ యోగం

జ్యోతిషశాస్త్రంలో కుజుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి. కుజుడు ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, పట్టుదల, బలం, ధైర్యానికి ప్రతీక. జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే పట్టిందల్లా బంగారం అవుతుందనీ, అన్నింటా అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం కుజ గ్రహం ప్రతి 45 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటుంది. కుజుడి సంచారంలో ఖచ్చితంగా అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అయితే కుజుడు ప్రస్తుతం తన ప్రయాణాన్ని తిరోగమనంలోకి మార్చుకున్నాడు. కర్కాటక రాశిలో వెనక్కి తిరిగి ప్రయాణిస్తున్నాడు. డిసెంబర్ 7 శనివారం తెల్లవారుజామున 5:01 గంటలకు కుజుడు తిరోగమన స్థితిలోకి వచ్చాడు. నేటి నుంచి జనవరి 2025 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు.

yearly horoscope entry point

కర్కాటక రాశిలో కుజుడి తిరోగమన సంచారం మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపుతున్నప్పటికీ మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో మూడు రాశుల వారికి ధనలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం చాలా పవిత్రమైనది. వ్యాపార, ఆర్థిక, ఆదాయ విషయాల్లో కొన్ని రాశుల వారిని అదృష్టవంతులను చేస్తుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.

కన్యారాశి:

కర్కాటక రాశిలో కుజుడు తిరోగమన స్థితిలో సంచరిస్తున్నప్పుడు కన్యా రాశి వారికి 11వ స్థానంలో ఉంటాడు. ఇది మీకు ధనలక్ష్మీ యోగాన్ని తెచ్చిపెడుతుంది. జీవితం లాభాల బాటలో సాగుతుంది. ధైర్యాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఆదాయం పొందడంలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుని భారీ లాభాలు అందుకుంటారు. మీరు మీ పనిని విస్తరించుకుంటారు. ఇందులో విజయం సాధిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది.

తులా రాశి:

కుజుడి తిరోగమన సంచారం తులా రాశి వారికి కూడా ధనలక్ష్మీ యోగాన్ని తెచ్చిపెట్టింది. ఈ సమయంలో మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా ఆర్థికంగా బలపడతారు. కొత్త అవకాశాలను కనుగొని ముందుకు సాగుతారు. ఆర్థికంగా మీరు వేగంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది సమయం మీకు అత్యంత శుభప్రదంగాా ఉంటుంది.

మీన రాశి:

మీన రాశి వారికి కుజుడి తిరోగమన సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. యోగా, వ్యాయామం, ధ్యానంతో కూడిన సమతులాహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శుభ ఫలితాల కారణంగా విద్య, పోటీ రంగాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. పరీక్షకు సన్నద్ధమయ్యే వారు కష్టపడితే విజయం లభిస్తుంది. జీవితంలో ప్రయోజనాలను పెరుగుతాయి. ఊహించని సంతోషకరమైన ఫలితాలను మీరు చూడవచ్చు.కొత్త సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి 24 వరకు కుజుడు మీకు ఇంతే అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner