Mars Retrogade: కుజుడి తిరోగమనం, డిసెంబర్ 7నుంచి ఈ రాశుల వారికి రాజయోగం, డబ్బుకు కొదవే లేదు
Mars Retrogade: ఆత్మ విశ్వాసానికి, ధైర్యానికి ప్రతీక అయిన కుజుడు డిసెంబరు 7న తిరోగమనం చెందనున్నాడు. దీంతో కొన్ని రాశులకు రాజయోగం, ధన రాశుల వర్షం కురియనుంది.
నవ గ్రహాలకు అధిపతియైన కుజుడు 45 రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఇందులో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 23వరకు తన దిశను మార్చుకుని సింహం, కర్కాటక రాశులలో సంచరించనుంది. కుజుడు ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలకు, పట్టుదలకు, బలానికి, ధైర్యానికి ప్రతీక. ప్రస్తుతం అంగారక గ్రహం కర్కాటకం ద్వారా సంచరిస్తోంది.
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ (అంగారక) గ్రహాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అంగారకుడు గ్రహాలకు అధిపతిగా కొలుస్తారు. ఈ గ్రహం రక్తం, బలం, భూమిపై ప్రభావం చూపిస్తుంటుంది. అంగారకుడు తన రాశిని మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. డిసెంబర్ 7న అంటే రేపటి నుంచే కుజుడు తిరోగమనంలో సంచరిస్తాడు. దీని ఫలితంగా కొన్ని రాశులకు రాజయోగం సిద్ధించనుంది. ఆ ప్రభావం ఏయే రాశులపై ఉండనుందో చూద్దాం.
మేష రాశి :
కుజుడు తిరోగమన సంచారం మీకు మంచి యోగాన్ని అందించనుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఫలితంగా వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా మారనుంది. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత ప్రణాళికలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది. వ్యాపార విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకుంటారు.
సింహం
కుజుడు తిరోగమన సంచారం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా ముగుస్తాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త పెట్టుబడులతో మంచి లాభాలు పొందుతారు. పాత ప్రాజెక్టులు మంచి పురోగతిని తెస్తాయి. ధనానికి కొదవ ఉండదు. అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలోనూ ఏదో ఒకవైపు నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు
ఈ రాశి వారికి కుజుడి తిరోగమన సంచారం మీకు జీవితంలో పురోగతిని తీసుకురాబోతోంది. మీ బంధువులతో మీకు భావోద్వేగ బంధం (ఎమోషనల్ బాండింగ్) ఏర్పడుతుంది. స్నేహితులు మీకు సహాయపడతారు. కుటుంబ వాతావరణం మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. వైవాహిక జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపార విస్తరణకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశాల్లో ఉన్నవారికి మంచి యోగం లభిస్తుంది.
గమనిక
ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.