Mars retrograde: వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, తిరోగమనం, అస్తంగత్వం చాలా ముఖ్యమైన వాటిగా పరిగణిస్తారు. నిర్ధిష్ట సమయం తర్వాత గ్రహాలు వాటి రాశులను కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. ఇది మొత్తం పన్నెండు రాశుల మీద శుభ, అశుభ ప్రభావాలు చూపిస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతిగా పిలిచే అంగారకుడు ఈ ఏడాది చివర్లో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు.
అంగారక గ్రహం తిరోగమన కదలిక ప్రజల మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. కుజుడు ఒక రాశిలో 45 రోజుల పాటు సంచరిస్తాడు. శక్తి, సోదరుడు, శౌర్యం, ధైర్యం, పరాక్రమం వంటి వాటికి అంగారకుడు ప్రాతినిథ్యం వహిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజుడి శుభ ప్రభావం కారణంగా వ్యక్తి ధైర్యంగా, నిర్భయుడిగా ఉంటాడు. మానసిక స్థితి బాగుంటుంది. వ్యక్తి శక్తి, విశ్వాసంతో నిండి ఉంటాడు.
దృక్ పంచాంగ్ ప్రకారం మార్స్ 6 డిసెంబర్ 204న కర్కాటక రాశిలో తిరోగమనంలో కదులుతుంది. వచ్చే ఏడాది 23 ఫిబ్రవరి 2025 వరకు తిరోగమన స్థితిలో ఉంటుంది. 79 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభాల పంట పండుతుంది. అంగారక గ్రహం తిరోగమన కదలిక కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొంతమంది జీవితంలో అనేక కష్టాలను భరించవలసి ఉంటుంది. అంగారకుడి తిరోగమనం వల్ల ఏ రాశులు ప్రభావితం అవుతాయో తెలుసుకుందాం.
కుజుడి తిరోగమనం మేష రాశి వారికి మెరుగైన ఫలితాలు అందిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలు సాధిస్తారు. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు. భౌతిక సుఖాలలో జీవితాన్ని గడుపుతారు. సామాజిక హోదా, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కుజుడి తిరోగమన సంచారం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. వ్యక్తిగత, వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది. ధైర్యసాహసాలు ఫలిస్తాయి. మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దాంపత్య జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు.
అంగారకుడి తిరోగమన కదలిక జీవితంలో పెద్ద మార్పులను తెస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి. ఈ కాలంలో భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. భాగస్వామితో బంధం బలపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.