Angaraka yogam: అన్ని గ్రహాలకు అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. అటువంటి కుజుడి సంచారం బలహీనంగా ఉంటే ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు, అడ్డంకులను సృష్టిస్తుంది.
మరోవైపు రాహువు నీడ గ్రహం. జాతకంలో రాహు స్థానం అశుభకరంగా ఉంటే చెడు లక్షణాలకు బానిసలు అవుతారు. ఇప్పుడు ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండటం వల్ల అశుభకరమైన అంగారక యోగం ఏర్పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధైర్యం, శౌర్యం, శక్తికి కారకుడుగా కుజుడిని భావిస్తారు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న కుజుడు జూన్ 1 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అక్కడ ఇప్పటికే రాహువు సంచరిస్తున్నాడు. మీన రాశిలో కుజుడు, రాహువు కలిసి అంగారక యోగాన్ని సృష్టించారు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారక యోగాన్ని అశుభంగా పరిగణిస్తారు.
కుజుడు నీడ గ్రహం రాహువుతో కలిసి వస్తే జీవితంలో అనేక క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. జాతకంలో ఈ యోగం ఉంటే ప్రతి పనికి ఆటంకం కలుగుతుంది. అంగరాకుడు మీన రాశిని వదిలి జూన్ 1వ తేదీన మేష రాశి ప్రవేశం చేస్తాడు. అప్పటితో అంగారక యోగం ప్రభావం ముగుస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు నిర్వహించకుండా ఉండటం మంచిది. అంగారక యోగం ప్రభావం వల్ల జూన్ 1 వరకు ఏ రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేష రాశిని కుజుడు పరిపాలిస్తాడు. అందువల్ల అంగారక యోగం వీరికి అననుకూలంగా ఉంటుంది. ఏదైనా పని మధ్యలోనే ఆపాల్సి వస్తుంది. డబ్బు చేతికి అందకపోవడం వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంగారక యోగం ప్రభావంతో మేష రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మానసిక క్షోభ ఉంటుంది. అన్ని పనులు అడపాదడపా సాగుతాయి. మితిమీరిన ఖర్చుల వల్ల మనసు కలత చెందుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక సంబంధిత వివాదాల గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. ఎంత కష్టపడినా సత్ఫలితాలు రావు. పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఓపికగా ఉండాలి.
కుజుడు, రాహువు కలసి అంగారక యోగాన్ని ఇవ్వటం వల్ల కన్యా రాశి వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ధన నష్టం సంభవించవచ్చు. సంబంధాల్లో విభేదాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలోను చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. పనుల్లో ఆటకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసు ఆందోళన చెందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. లేదంటే పోలీస్ కేసులో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో సులభంగా కోపం వస్తుంది. అందుకే మీ మాటల మీద నియంత్రణ ఉంచుకోవాలి.
అంగారక యోగం ప్రభావం ధనుస్సు రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మనసు చంచలంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి. జీవితం భాగస్వామితో విభేదాలు ఉంటాయి. మూడవ వ్యక్తి మీ వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. తోటి వారితో ఏర్పడిన సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి.