Mars nakshtra transit: భరణి నక్షత్రంలో కుజుడు.. ఈ నాలుగు రాశులకు సంతోషకరమైన జీవితం-mars in bharani nakshtram four zodiac signs get happy life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Nakshtra Transit: భరణి నక్షత్రంలో కుజుడు.. ఈ నాలుగు రాశులకు సంతోషకరమైన జీవితం

Mars nakshtra transit: భరణి నక్షత్రంలో కుజుడు.. ఈ నాలుగు రాశులకు సంతోషకరమైన జీవితం

Gunti Soundarya HT Telugu
Jun 26, 2024 06:30 PM IST

Mars nakshtra transit: అంగారకుడు భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావంతో నాలుగు రాశుల జాతకులు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. కుటుంబ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.

భరణి నక్షత్రంలోకి కుజుడు
భరణి నక్షత్రంలోకి కుజుడు

Mars nakshtra transit: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు రాశి, నక్షత్ర మార్పుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నవగ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారినప్పుడు అది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జూన్ 19న అంగారకుడు భరణి నక్షత్రంలోకి వెళ్ళాడు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. 

yearly horoscope entry point

మొత్తం 27 నక్షత్రాలలో భరణి నక్షత్రం చాలా శుభప్రదమైనదిగా చెప్తారు. కుటుంబ బంధాలను బలోపేతం చేసేందుకు సహాయపడే శుభ నక్షత్రంగా పరిగణిస్తారు. ఈ భరణి నక్షత్రం రెండో పాదం మంచిదిగా చెప్తారు. ఇది సృజనాత్మకత, ఇంద్రియాలకు సంబంధించినదిగా పండితులు చెబుతున్నారు.

ఈ నక్షత్రంలో సంచరించడం వల్ల కుజుడు, శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. కుజుడు శుక్రుడి నక్షత్రంలో పయనించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వేద జ్యోతిషశాస్త్రంలో అంగారకుడిని శౌర్యానికి కారకుడిగా వర్ణించారు. మేషం అంగారక గ్రహం మూల త్రికోణ రాశి. మొదటి, ఎనిమిదో గృహాలకు అధిపతి. కుజుడు శుభ స్థానంలో ఉంటే అధికారం, గౌరవం, గొప్ప ప్రయోజనాలు ఇస్తాడు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. భరణి నక్షత్రంలో కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఉంటుందో చూద్దాం.

మేష రాశి

ప్రస్తుతం మేష రాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా భరణి నక్షత్రంలో సంచరించడం వల్ల వీరికి కెరీర్ లో చాలా పురోగతి లభిస్తుంది. వ్యాపారస్థులకు లాభాలు వస్తాయి. కొత్త వ్యక్తులతో స్నేహబంధం ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉన్నత చదువులు చదివేందుకు విదేశాలకు వెళ్లాలనే కల సాకారం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసికంగా ధృఢంగా ఉంటారు. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి. ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి

కుజుడి నక్షత్ర మార్పుతో వృషభ రాశి వారికి మంచి రోజులు వచ్చినట్టే. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మద్ధతు పొందుతారు. కెరీర్ లో పురోగతికి గొప్ప అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

తులా రాశి

భరణి నక్షత్రంలో కుజుడి సంచారం ప్రభావంతో తులా రాశికి చెందిన వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. జీవనశైలి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదిస్తారు. అలాగే పొదుపు చేస్తారు. ఆస్తిని కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. పని రంగంలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికం, మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చిక రాశి

అంగారకుడి నక్షత్ర మార్పు వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు, విజయావకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరపడతారు. కెరీర్ లో గొప్ప అవకాశాలు ఎదురుపడతాయి. ఉద్యోగం మారేందుకు ఇది అనుకూలమైన సమయం. తల్లిదండ్రులతో మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్విగ్నంగా పూర్తి చేస్తారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోయే సమయం ఇది. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner