Dhana shakthi raja yogam: ధనశక్తి రాజయోగం…ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా ఇక మంచి రోజులు
Dhana shakthi raja yogam: శుక్రుడు, కుజుడు సంయోగం వల్ల ధనశక్తి రాజయోగం ఏర్పడబోతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి సంపద రాబోతుంది. కాలం కలిసొస్తుంది.
సంపద ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 15న కుంభ రాశిలోకి అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు, కుజుడు ఒకే రాశిలో సంయోగం చెందటం వల్ల ధన శక్తి రాజయోగం ఏర్పడనుంది.

జ్యోతిష్య శాస్త్రంలో ఈ ధన శక్తి యోగానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ధనశక్తి యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి సంపద పెరుగుతుంది. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ రాజయోగంతో కొన్ని రాశుల అదృష్టం మారబోతుంది. ఇది అన్ని రాశి చక్ర జాతకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కొన్ని రాశులకు మాత్రం భారీగా ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని ధైర్యం, పరాక్రమం, శక్తికి కారకుడుగా భావిస్తారు. అంగారకుడి అనుగ్రహం ఉంటే వ్యక్తి జీవితంలో రాజ వైభవాన్ని అనుభవిస్తాడు. విజయవంతమైన కెరీర్ కోసం కుజుడు అనుగ్రహం తప్పనిసరి. ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే అన్ని రకాల సంతోషాలు, ఆరోగ్యం లభిస్తుంది. గౌరవం పొందుతారు.
ప్రేమ, ఆకర్షణ, భౌతిక ఆనందాలకు కారకుడు శుక్రుడు. ఈ గ్రహం అనుగ్రహంతో ప్రేమ పెరుగుతుంది. దంపతుల మధ్య సంబంధాలు బలపడతాయి .ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ధనశక్తి రాజయోగం ఏ ఏ రాశులకు అదృష్టాన్ని ఇవ్వబోతుందో చూద్దాం.
మేష రాశి
ధన శక్తి రాజయోగం మేష రాశి 11వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు కొరత ఎదుర్కొంటున్న వాళ్లు సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ రాశి జాతకులు కోరికలు నెరవేరబోతున్నాయి. వ్యాపారస్తులకు ఈ రాజయోగం శుభప్రదం. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. కెరీర్ లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి
వృషభ రాశికి ధనశక్తి రాజయోగం శుభఫలితాలు ఇస్తుంది. పని ప్రదేశంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబంతో మతపరమైన ప్రదేశానికి పర్యటనకు వెళ్తారు. పాత మిత్రుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి
ఈ సమయంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ రాజయోగం మిథున రాశి తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు భారీ ఒప్పందాలు జరుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ధనశక్తి రాజయోగంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తిగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ధన లాభం పొందుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం వల్ల వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాల్లో లాభ అవకాశాలు ఉంటాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు ఈ సమయంలో నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశిలోనే శుక్రుడు, కుజుడు కలయిక జరుగుతుంది ఫలితంగా ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం ప్రభావంతో కుంభ రాశి జాతకులు వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణిస్తారు. సంపదకు దేవతగా భావించే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు. డబ్బు సంపాదిస్తారు. పొదుపు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారవేత్తలు తమ రంగాల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి మంచి సమయం.