జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి కాలానుగుణంగా ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గ్రహాలు సంచరించినప్పుడు అనేక యోగాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని శుభ యోగాలు అయితే, మరికొన్ని అశుభ యోగాలు. జూన్ 20న శని, కుజుడు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కష్టాలు, దుఃఖాలను తీసుకువస్తుంది.
ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుడు, శని షడాష్టక యోగంతో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుంది? ఏ ఏ రాశుల వారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షడాష్టక యోగం అశుభ ఫలితాలను అందిస్తుంది. అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు వంటివి కూడా కలగవచ్చు. ఈ మూడు రాశుల వారికి మాత్రం చిన్న చిన్న సమస్యలు రావచ్చు.
మకర రాశి వారికి శని–కుజుడు షడాష్టక యోగం ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి మానసిక ఇబ్బందులు వస్తాయి. కోపం ఎక్కువ అవుతుంది. టెన్షన్ పెరుగుతుంది.
ఎక్కువ ఆఫీసు వర్క్ కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే, ఈ సమయంలో ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి వారికి ఇబ్బందులు తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. పని ప్రదేశంలో తోటి ఉద్యోగులతో గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది.
కర్కాటక రాశి వారికి షడాష్టక యోగం ఇబ్బందులను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు బయట ఆహారం తినడం మంచిది కాదు. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఈ సమయంలో చదువు పట్ల ఆసక్తిని కోల్పోతారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
పని ప్రదేశంలో మీ బాస్ నుంచి తిట్లు పడే అవకాశం ఉంది. చుట్టుపక్కల వారితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.