కుజ కేతువుల సంయోగంతో జూలై 28 వరకు ఈ మూడు రాశులకు సమస్యలు.. ఆర్థిక నష్టం, అప్పులు, గొడవలు ఇలా ఎన్నో.. తస్మాత్ జాగ్రత్త!-mars and ketu conjunction brings troubles to aries leo and virgo till july 28th so be careful or else there will be loss ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కుజ కేతువుల సంయోగంతో జూలై 28 వరకు ఈ మూడు రాశులకు సమస్యలు.. ఆర్థిక నష్టం, అప్పులు, గొడవలు ఇలా ఎన్నో.. తస్మాత్ జాగ్రత్త!

కుజ కేతువుల సంయోగంతో జూలై 28 వరకు ఈ మూడు రాశులకు సమస్యలు.. ఆర్థిక నష్టం, అప్పులు, గొడవలు ఇలా ఎన్నో.. తస్మాత్ జాగ్రత్త!

Peddinti Sravya HT Telugu

కుజుడు ఇప్పటికే కేతువు ఉన్న సింహ రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు, కేతువు రెండు ఉగ్ర గ్రహాలు. జూన్ 30 నుంచి కుజుడు, కేతువులు ఒకే రాశిలో సంచారం చేస్తారు. దీని కారణంగా అశుభ సంయోగం ప్రభావం పెరుగుతుంది. జూలై 28 వరకు ఈ కలయిక ఉంటుంది. ఇది మూడు రాశుల వారిపై భారీ ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

కుజ కేతువుల సంయోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు (Canva)

గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక, వాటి స్థానంలో మార్పులు ఆధారంగా ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే, కుజుడు ఇప్పటికే కేతువు ఉన్న సింహ రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు, కేతువు రెండు ఉగ్ర గ్రహాలు. జూన్ 30 నుంచి కుజుడు, కేతువులు ఒకే రాశిలో సంచారం చేస్తారు. దీని కారణంగా అశుభ సంయోగం ప్రభావం పెరుగుతుంది. జూలై 28 వరకు ఈ కలయిక ఉంటుంది.

ఇది మూడు రాశుల వారిపై భారీ ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మరి ఈ మూడు రాశులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆ రాశుల వారు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కుజ కేతువుల సంయోగంతో ఈ మూడు రాశుల వారికి అనేక ఇబ్బందులు:

1.మేష రాశి

మేష రాశి వారికి కుజ కేతువుల సంయోగం ఇబ్బందులను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. వ్యాపారులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం కాదు.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం వలన ఇబ్బందులు వస్తాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి సమస్యలు రావచ్చు. ఈ రాశి వారు శత్రువుల వల్ల కూడా బాధ పడవచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.

3.కన్య రాశి

కన్య రాశి వారికి కూడా కుజ కేతువుల సంయోగం వలన ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి కోపం విపరీతంగా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కూడా సమస్యలు రావచ్చు. ఎక్కువైపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.