చాణక్య నీతి: ఇలాంటి మహిళను పెళ్లి చేసుకుంటే ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది-marrying such a woman brings good luck read todays chanakya niti ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  చాణక్య నీతి: ఇలాంటి మహిళను పెళ్లి చేసుకుంటే ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది

చాణక్య నీతి: ఇలాంటి మహిళను పెళ్లి చేసుకుంటే ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది

Gunti Soundarya HT Telugu
Nov 08, 2024 08:04 AM IST

నేటి రోజుల్లో భార్యాభర్తలు చిన్న విషయాలకే అలగడం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే దాని గురించి ఆచార్య చాణక్యుడు చక్కగా వివరించారు.

భార్యాభర్తలు ఎలా ఉండాలంటే
భార్యాభర్తలు ఎలా ఉండాలంటే (pinterest)

ఆచార్య చాణక్యుడి విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు. ఆచార్య చాణక్యుడి విధానాల వల్ల చంద్రగుప్త మౌర్యుడు రాజు కాగలిగాడు. భారతదేశంలోని గొప్ప పండితులలో ఆచార్య చాణక్యుడి పేరు ఉంటుంది.

నేటి కాలంలో కూడా చాణక్యుడి విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడింది. చాణక్య నీతి స్త్రీల గురించి కూడా వివరంగా చెప్పారు. పురుషుడు ఎలాంటి స్త్రీని వివాహం చేసుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది? భార్యకు ఎలాంటి అలవాట్లు ఉంటే ఆ జీవితం నరకంగా మారుతుందో చక్కగా వివరించారు.

మత మార్గాన్ని అనుసరించే స్త్రీ

ఆచార్య చాణక్యుడు ప్రకారం మత మార్గాన్ని అనుసరించే స్త్రీని వివాహం చేసుకోవడం వ్యక్తికి అదృష్టాన్ని తెస్తుంది. నిత్యపూజలు జరిగే ఇంట్లో దేవుడు కొలువై ఉంటాడు. అలాంటి ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి గుడిలో దీపం పెట్టె మహిళ గొప్ప స్త్రీ అని వివరించారు.

సంతృప్తి, సహనం కలిగిన స్త్రీ

ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం సంతృప్తి, సహనం ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడం వ్యక్తికి అదృష్టాన్ని తెస్తుంది. అలాంటి స్త్రీ తన భర్తకు ప్రతి సందర్భంలోనూ మద్దతు ఇస్తుంది. సహనం కలిగిన స్త్రీని వివాహం చేసుకోవడం ఒక వ్యక్తి విధిని మారుస్తుంది. భర్త చిన్న వస్తువు తెచ్చినా అందులోనే సంతోషం వెతుక్కుని సంతృప్తి చెందితే ఆ భర్త అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు.

కోపం రాని స్త్రీ

కోపం అన్నింటికీ అనార్థాలు తీసుకొస్తుంది. ఒక కుటుంబం నిలబడాలి అంటే మహిళకు ఎప్పుడూ కోపం తగదు. ఆచార్య చాణక్య ప్రకారం కోపం తెచ్చుకోని స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల అతడి జీవితం పూల పాన్పు మాదిరిగా ఉంటుంది. కోపం ఒక వ్యక్తికి అతి పెద్ద శత్రువు.

మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ

ఆచార్య చాణక్యుడు ప్రకారం మధురమైన మాటలు మాట్లాడే స్త్రీని వివాహం చేసుకోవడం ఒక వ్యక్తి అదృష్టాన్ని మారుస్తుంది. అలాంటి స్త్రీల ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ కలివిడిగా ఉండే స్త్రీ ఇంట్లో ఉంటే గొడవలు అనేవి ఉండవు.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి సమస్యలు ఎదుర్కోవాలి. జీవితంలో కష్టాలు, సుఖాలు సర్వసాధారణం. అయితే సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా భర్తకు అండగా ప్రతి భార్య నిలవాలి. భార్యాభర్తల మధ్య బంధం బలపడాలి అంటే ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ, నమ్మకం లేని జంట ఎక్కువ కాలం కలిసి జీవించలేదు. భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అంకితభావంతో ఉంటే బంధంలో ఎలాంటి పొరపొచ్చాలు ఉండవు.

ఇద్దరి మధ్య నమ్మకం లేకపోతే వైవాహిక జీవితంలో చీలికకు దారి తీస్తుంది. విశ్వాసం అనేది వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన ఎప్పుడూ మనసులో ఉండకూడదు.

Whats_app_banner