Marriage Dates:శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ మే 2025 వరకూ నాన్ స్టాప్ ముహూర్తాలు, ఈ తేదీల్లన్నీ మంచి రోజులే-marriage dates in 2024 and 2025 according to hindu panchang ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Marriage Dates:శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ మే 2025 వరకూ నాన్ స్టాప్ ముహూర్తాలు, ఈ తేదీల్లన్నీ మంచి రోజులే

Marriage Dates:శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్ మే 2025 వరకూ నాన్ స్టాప్ ముహూర్తాలు, ఈ తేదీల్లన్నీ మంచి రోజులే

Ramya Sri Marka HT Telugu
Nov 10, 2024 12:44 PM IST

Marriage Dates: వివాహం, గృహ ప్రవేశం, పుట్టు వెంట్రుకలు, శంకుస్థాపనలు లాంటి శుభకార్యాలన్నింటికీ చాలా రోజులుగా బ్రేకులు పడ్డాయ్. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత నవంబర్ 12, 2024 మంగళవారం నుంచి ముహూర్తాలే ముహూర్తాలు. 2024, 2025సంవత్సరాల్లో ఏ నెలలో ఏయే తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయో తెలుసుకుందాం.

నవంబరులో పెళ్లి ముహూర్తాలు
నవంబరులో పెళ్లి ముహూర్తాలు

శుభకార్యం జరపాలంటే మంచి ముహూర్తం తప్పనిసరి. అందుకే శుభసమయాల కోసం ఎన్ని నెలలైనా ఎదురుచూస్తూ ఉంటారు. మంచి రోజులు లేక ఈ సంవత్సరం పెళ్లి, శంకుస్థాపన, గృహ ప్రవేశం లాంటి కార్యక్రమాలు దాదాపు నాలుగు నెలలుగా బ్రేకులు పడ్డాయి. అలా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకున్న వారికి గుడ్ న్యూస్. మంగళవారం అంటే నవంబరు 12 మంచి రోజులకు కొదవే లేదు. ఈ రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని శుభప్రదం కలుగుజేయనున్నారు. దానినే దేవోత్తన్ ఏకాదశిగా జరుపుకుంటారు.

దేవోత్తన్ ఏకాదశి:

జులై 17 బుధవారం నుంచి మొదలైన చాతుర్మాసం నవంబరు 11 సాయంత్రం 6:46 గంటల సమయానికి ముగిసిపోనుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల పాటు విష్ణువు యోగనిద్రలోకి వెళ్లగా పరమేశ్వరుడు విశ్వాన్ని సంరక్షిస్తుంటాని నమ్ముతారు. అలా యోగనిద్ర నుంచి మేల్కొన్న రోజును దేవోత్తన్ ఏకాదశి అని పిలుస్తారు. కార్తీకమాసంలో వచ్చే ఈ ఏకాదశి తిథి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6:46కు మొదలై మరుసటి రోజు అంటే నవంబర్ 12 సాయంత్రం 4:05వరకూ కొనసాగుతుంది. ఆ రోజు నుంచి వివాహాలు, గృహ ప్రవేశాలు, పుట్టు వెంట్రుకలు, శంకుస్థాపన వంటి శుభకార్యాలు జరుపుకోవచ్చు.

2024 ముహూర్త వివరాలు:

నవంబర్ 16, 17, 18, 22, 23, 24, 25, 26, 28 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలతో అనుకూల సమయం ఉంది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో 2, 3, 4, 5, 9, 10, 11, 13, 14, 15 తేదీల్లో పెళ్లిళ్లకు శుభ సమయాలు ఉన్నాయి.

మిథిలా పంచాంగం ప్రకారం,

2024 నవంబరు నెలలో వివాహ ముహూర్తాలు: 13, 16, 17, 18, 22, 23, 25, 26, 28, 29 తేదీలు.

2024 డిసెంబరు నెలలో వివాహ ముహూర్తాలు: 05, 09, 10, 14, 15 తేదీలు.

2025 శుభ ముహూర్తాల వివరాలు:

జనవరి 2025 శుభ ముహూర్తాల తేదీలు - 16, 18, 19, 20, 21, 22, 24, 26, 27

ఫిబ్రవరి 2025 శుభ ముహూర్తాల తేదీలు - 3, 4, 7, 8, 14, 15, 16, 18, 20, 21, 23, 25, 26

మార్చి 2025 శుభ ముహూర్తాల తేదీలు - 1, 2, 3, 6

ఏప్రిల్ 2025 శుభ ముహూర్తాల తేదీలు - 14, 16, 18, 19, 20, 21, 22, 23, 29, 30

మే 2025 శుభ ముహూర్తాల తేదీలు -

1, 5, 6, 7, 8, 13, 15, 17, 18, 19, 24, 28

Whats_app_banner