మార్గశిర అమావాస్య, అమా సోమ వ్రతం - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఈ రోజు అమావాస్యతో కూడి ఉన్న సోమవారం అవడం చేత సంతానం కోసం ఆయురారోగ్యాల కోసం, స్త్రీలు సౌభాగ్యం కోసం ఆచరించే ఉత్తమ వ్రతాలలో ఒకటైనటువంటి అమా సోమ వ్రతం ఈ రోజు ఆచరించడం చేత శుభ ఫలితాలు పొందవచ్చని చిలకమర్తి తెలిపారు.
30 డిసెంబరు 2024 సోమవారం మరియు మార్గశిర మాస అమావాస్య అవడం చాలా విశేషమైన రోజు అని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సోమవారంతో కూడి ఉన్న అమావాస్య రోజు కనుక అమా సోమ వ్రతం ఆచరించడానికి ఉత్తమమైన రోజుగా ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మార్గశిర మాస అమావాస్య రోజు పితృదేవతల వంటి వారికి తర్పణాలు ఆచరించడం, పితృకార్యాలు వంటివి ఆచరించాలని చిలకమర్తి తెలిపారు.
108 ప్రదక్షిణలు
ఈ రోజు అమావాస్యతో కూడి ఉన్న సోమవారం అవడం చేత సంతానం కోసం ఆయురారోగ్యాల కోసం, స్త్రీలు సౌభాగ్యం కోసం ఆచరించే ఉత్తమ వ్రతాలలో ఒకటైనటువంటి అమా సోమ వ్రతం ఈ రోజు ఆచరించడం చేత శుభ ఫలితాలు పొందవచ్చని చిలకమర్తి తెలిపారు. అమా సోమ రోజున రావి చెట్టును పూజించి దానికి 108 ప్రదక్షిణలు చేసినట్లయితే, వైధవ్యం ఉండదని పురాణాలు తెలియజేసినట్లుగా చిలకమర్తి తెలిపారు.
అమావాస్యతో కూడి ఉన్న సోమవారం రోజు రావి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి సకల కోరికలు నెరవేరతాయని, అమా సోమ వ్రత మహత్యం తెలియజేస్తుందని చిలకమర్తి తెలిపారు. ఈ రోజును రావి చెట్టును దర్శించినా, రావి చెట్టును నమస్కరించినా లేదా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి మూలని చూసి మూలతో బ్రహ్మ రూపాయా అని, రావి చెట్టు మధ్య భాగాన్ని చూసి మధ్యతో విష్ణు రూపిణే అని, రావి అగ్రభాగాన్ని చూసి అగ్రత శివ రూపాయా అని, రావి చెట్టు మొత్తాన్ని వృత్త రాధాయతే నమహ అని ఎవరైతే చెప్పుకుంటారో, ఇలా చెప్పుకుంటూ 108 ప్రదక్షిణలు చేసినటువంటి వారికి సకల కోరికలు సిద్ధిస్తాయని, చిలకమర్తి తెలియజేశారు.
శివుడికి ఇష్టమైన వారం సోమవారం, ఇలాంటి సోమవారం అమావాస్యతో కూడుకుని ఉన్నప్పుడు అది చాలా విశేషమైనదని శాస్త్రాలు తెలియజేశాయి. అమావాస్యతో కలిసి వచ్చే సోమవారాన్ని సోమావతి అమావాస్య అని చెప్పబడింది. ఈ సోమావతి అమావాస్య రోజు శివారాధన అత్యంత విశేషమైనదని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అందుచేత అమా సోమ వ్రతం లేదా సోమావతి వ్రతం ఆచరించేటప్పుడు రావి చెట్టు కింద శివ లింగాన్ని, శ్రీమన్నారాయణ మూర్తిని పెట్టి ఎవరైతే పూజిస్తారో అలాగే, రావి చెట్టుకు ఈ రోజు ప్రదక్షిణలు ఆచరిస్తారో, పేదలకు ఈ రోజు అన్నదానాలు చేస్తారో వారికి విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని, శాస్త్రాలు తెలియజేస్తున్నట్లుగా చిలకమర్తి తెలిపారు.
ఈ రోజు శివుడ్ని ఆరాధించినటువంటి వారికి దక్షిణి యొక్క పురాణ కథ ప్రకారం, జాతకంలో చంద్రుడు కనుక బలహీనంగా ఉంటే ఆ దోషాలు తొలగి చంద్ర గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు. అమా సోమ వ్రతం గురించి, వ్రత విధానం గురించి వ్యాసుల వారు తెలియజేశారని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ అమాసోమ వ్రతాన్ని ఆచరించి, రావి చెట్టును పూజించిన వారికి అభీష్ట సిద్ది కలిగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
సంబంధిత కథనం