Margasira Amavasya 2022 : మార్గశిర అమావాస్యరోజు ఇలా చేస్తే.. పుణ్య ఫలితాలు పొందుతారట..-margasira amavasya 2022 importance and significance and shuba muhurtam and puja ritulas are here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Margasira Amavasya 2022 Importance And Significance And Shuba Muhurtam And Puja Ritulas Are Here

Margasira Amavasya 2022 : మార్గశిర అమావాస్యరోజు ఇలా చేస్తే.. పుణ్య ఫలితాలు పొందుతారట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 23, 2022 08:19 AM IST

Margasira Amavasya 2022 : మార్గశిర మాసాన్ని అఘన మాసం అని కూడా అంటారు. హిందూ మతంలో ఈ నెలలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా శ్రీకృష్ణునికి మార్గశిర మాసం చాలా ప్రీతికరమైనదిగా చెప్తారు. అయితే ఈరోజు చేయాల్సిన పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకోండి.

మార్గశిర అమావాస్య 2022
మార్గశిర అమావాస్య 2022

Margasira Amavasya 2022 : శ్రీకృష్ణుడికి.. మార్గశీర్ష మాసం అంటే చాలా ఇష్టమైనదిగా చెప్తారు. ఎందుకంటే.. ఈ మాసం గురించిఅర్జునుడికి గీతా బోధ చేస్తున్నప్పుడు.. స్వయానా శ్రీకృష్ణుడే.. 12 మాసాలలో తనకు మాసం అంటే చాలా ఇష్టమని కూడా చెప్తాడు. అలాంటి ఈ మార్గశిర మాసంలో వచ్చే.. అమావాస్య చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. అయితే ఈ సంవత్సరం మార్గశిర మాసంలో అమావాస్య నవంబర్ 23వ తేదీన వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మార్గశిర అమావాస్య రోజున చేసే దానధర్మం చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తారు. అంతేకాకుండా పూజలు, ఆచారాలు మొదలైనవి కూడా పుణ్య ఫలితాలను ఇస్తాయని భక్తులు భావిస్తారు. అయితే మార్గశిర అమావాస్య పూజా విధానం, శుభ సమయం, రోజు ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మార్గశిర అమావాస్య శుభ ముహూర్తం 2022

* మంగళ అమావాస్య తేదీ - 23 నవంబర్ 2022, బుధవారం

* అమావాస్య తేదీ ప్రారంభం - నవంబర్ 23, 6:53 am

* అమావాస్య తేదీ ముగింపు - నవంబర్ 24, 4:26 am

* శుభ సమయం - నవంబర్ 23, ఉదయం 5:06 నుంచి ఉదయం 6:52

మార్గశిర అమావాస్య పూజా విధానం

మార్గశీర్ష అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర నదిలో, చెరువులో స్నానం చేయండి. అమావాస్య తిథి రోజున యమునా నదిలో స్నానం చేయడాన్ని ప్రత్యేక ప్రాముఖ్యతగా చెప్తారు. మర్నాడు అమావాస్య రోజున యమునా నదిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

అమావాస్య రోజున స్నానమాచరించిన తర్వాత ఉపవాస వ్రతం చేయండి. ఉపవాస వ్రతం చేసిన తర్వాత.. శ్రీమహావిష్ణువును పూజించి.. శ్రీ సత్యనారాయణ స్వామి కథను పఠించండి. కుటుంబం మొత్తం కలిసి కథ వినండి. పూజ పూర్తయిన తర్వాత.. బ్రాహ్మణునికి మీ శక్తికి తగినట్లుగా దానము, దక్షిణ ఇవ్వండి. ఈ రోజున సత్యనారయణుడిని ఆరాధించడం వల్ల.. పాపాలు అన్ని నశిస్తాయని భావిస్తారు. అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

మార్గశిర అమావాస్య ప్రాముఖ్యత

అమావాస్య తిథి కాలసర్ప దోషం, పితృ దోషాలను తొలగించడానికి ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున పుణ్యస్నానం చేయడం, పేదలకు దానాలు చేయడం, పుణ్యకర్మలు చేయడం వల్ల ఈ రెండు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. వీలైనంత ఎక్కువ ఆహారాన్ని బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్