మార్చి 30, నేటి రాశి ఫలాలు.. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు, ఎవరిని అతిగా నమ్మొద్దు-march 30th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 30, నేటి రాశి ఫలాలు.. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు, ఎవరిని అతిగా నమ్మొద్దు

మార్చి 30, నేటి రాశి ఫలాలు.. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు, ఎవరిని అతిగా నమ్మొద్దు

HT Telugu Desk HT Telugu
Mar 30, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ30.03.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 30వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 30వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 30.03. 2024

వారం: శనివారం, తిథి : పంచమి,

నక్ష్మత్రం : అనురాధ, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులలో విజయం లభిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభాన్నిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబములో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశముంది. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి, నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటివారి సహకారం అందుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీమీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. కుటుంబ సహకారం ఉంటుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికపరంగా ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలుంటాయి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని, నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆశించిన ఫలితాల కోసం బాగా కష్టపడాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. అధికారుల వైఖరి మీపట్ల మధ్యస్థంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. దశరథ ప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన విషయంలో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులు సహకారం అందుతుంది. పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తపడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బందిపడతారు. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. తోటివారి సహకారం అందుతుంది. ఆటంకాలు తొలగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుప్రీతి ఉన్నది. స్వల్ప ప్రయత్నంలో విజయం వరిస్తుంది. మీమీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మీరు చేసే పనులు విజయాన్నిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సమాజంలో మంచి పేరు వస్తుంది. కొందరి ప్రవర్తన వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. శుభవార్త వింటారు. ఇబ్బందులు నుంచి బయటపడతారు. చెడు తలంపులు వద్దు. తోటివారి సహకారంతో ఒక పని పూర్తవుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ అలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అప్పులు ఇబ్బందిపెడతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. శత్రువులతో అచితూచి వ్యవహరించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. మిత్రుల సూచనలు మేలుచేస్తాయి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయం అందుతుది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్నిస్తుంది. నూతన వస్తు, వాహన యోగాలున్నాయి. చేపట్టిన పనుల్లో శుభఫలితాలు కలుగుతాయి. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. తోటివారి సలహాలతో చక్కటి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల సమయం. అధికారుల ప్రశంసలుంటాయి. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. కొన్ని నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిస్తాయి. వ్యతిరేక ఆలోచనలను దరిచేరనీయకండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అధికారులు, పెద్దలతో ఆచితూచి వ్యవహరించాలి. గొడవలతో కాలాన్ని వృథా చేసుకోకండి. ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అందరినీ సమభావంతో చూడడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల సలహాలతో అపదలు దూరమవుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మొహమాటాన్ని దరిచేరనీయకండి. చేపట్టే పనుల్లో విజయం ఉంటుంది. వ్యాపారపరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ముందస్తు ప్రణాళికతో శ్రమ తగ్గుతుంది. అరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner