మార్చి 29, నేటి రాశి ఫలాలు.. లక్ష్మీదేవికి పాలతో చేసిన ప్రసాదాలు పెడితే మంచిది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ29.03.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 29.03.2024
వారం: శుక్రవారం, తిథి : చవితి,
నక్షత్రం : విశాఖ, మాసం : ఫాల్గుణం
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఇబ్బందికర పరిస్థితులుంటాయి. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. అనుకున్న పనులు ఎంతగా శ్రమపడ్డా ముందుకు సాగవు. ఆరోగ్య విషయాలు, వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్షీ అష్టకం పఠించండి.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగముంది. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూలం. భూములకు సంబంధించిన వివాదాలను పరిష్మరించుకుంటారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులుంటాయి. అనుకోని విజయాలుంటాయి. వివాదాలు పరిష్కరించుకుని మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. నిరుద్యోగులకు అనుకూలం. అనుకున్న రాబడి దక్కుతుంది. కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ పట్టుదల, కృషికి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఇబ్బందిపెడతాయి. అనుకున్న అదాయం సమకూరుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పరించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదాలను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొంతకాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ధనవ్యయముంటుంది. విదేశీ పర్యటనటుంటాయి. స్వ ల్ప అనారోగ్య సమస్యలుంటాయి. శ్రమకు తగిన ఫలితముంటుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. అలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు జరుగుతాయి. అనుకోని ధనవ్యయముండును. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు అనుకూలమైన రోజు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. రాజకీయ నాయకులకు పదవులు వచ్చే అవకాశముంది. శ్రీకృష్ణుడిని పూజించాలి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. గతంలో నిలిచిన కొన్ని పనులు సాఫీగా పూర్తి కాగలవు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబములో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశముంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అనుకోని ఖర్చులుంటాయి. మానసిక అశాంతి. కళాకారులకు ఊహించిన అవకాశాలుంటాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్షీ అష్టకం పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలుంటాయి. విద్యార్థులు మంచి అవకాశాలను దక్కించుకుంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి పేరు సంపాదిస్తారు. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్నది సాధించడంలో విజయం సాధిస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కళాకారులకు సన్మానాలు. అనారోగ్య సమస్యలుంటాయియి. బంధువర్గంతో విరోధాలేర్పడతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. ఎంతోకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభించే అవకాశముంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పరించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదాలను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
మకర రాశి
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో మంచి గుర్తింపు ఉంటుంది. వ్యాపారస్తులకు తగినంత లాభాలు అందుతాయి. వాహనాలు, భూములు సమకూరతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. జీవితాశయం సాధనలో ముందడుగు వేస్తారు. అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. పాతమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన, కుటుంబ సౌఖ్యం. తీర్ధయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. రాజకీయనాయకులకు పదవులు అందుతాయి. రుణదాత ఒత్తిడులు తొలగుతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆర్థిక పరంగా గతం కంటే బాగుంటుంది. భూమి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఓర్పు, నేర్పుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు ఒత్తిడులను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్షీ అష్టకం పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000