మార్చి 28, నేటి రాశి ఫలాలు.. కొత్త వ్యక్తులతో పరిచయాలు, శుభవార్తలు వింటారు-march 28th 2024 today rasi phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  March 28th, 2024 Today Rasi Phalalu Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 28, నేటి రాశి ఫలాలు.. కొత్త వ్యక్తులతో పరిచయాలు, శుభవార్తలు వింటారు

HT Telugu Desk HT Telugu
Mar 28, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ28.03.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 28వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 28వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.03.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: గురువారం, తిథి : తదియ,

నక్షత్రం : స్వాతి, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతీ పని సత్ఫలితాలనిస్తాయి. అవకాశాలు కలసివస్తాయి. గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు. గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్చించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి కనబరుస్తారు. అందుకు అవసరమైన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయమై మిత్రులుగా మారతారు. రుణాలు తీరతాయి. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. అరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

నేటి దిన ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. దుబారా ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అకస్మిక ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబములో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం గురించి అధికంగా ఆలోచిస్తారు. రుణాలు చేస్తారు. మీ మీద ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక ఇబ్బందులు కొంతవరకు తీరతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువులతో జాగ్రత్త వహించాలి. దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారపరంగా లాభాలున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలసి ఆనందముగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. నూతన విద్యలపై అసక్తి చూపుతారు. ఆరోగ్య సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. రుణాల నుంచి విముక్తి పొందుతారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుడిని పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణాలు లభిస్తాయి. పనులలో ఎదురైన ఆటంకాలు, చికాకులు కొంతవరకు తీరతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు. శుభవార్తలు వింటారు. అనుకున్న కార్యక్రమంలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel