మార్చి 26, నేటి రాశి ఫలాలు.. ఆపద నుంచి బయట పడతారు, మీ కల సాకారమయ్యే సమయం ఇదే-march 26th 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  March 26th, 2024 Today Rasi Phalalu In Telugu Check Your Zodiac Signs Result For Daily Horoscope

మార్చి 26, నేటి రాశి ఫలాలు.. ఆపద నుంచి బయట పడతారు, మీ కల సాకారమయ్యే సమయం ఇదే

HT Telugu Desk HT Telugu
Mar 26, 2024 12:03 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ26.03.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 26వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 26వ తేదీ నేటి రాశి ఫలాలు (pexels)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26. 03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: మంగళవారం, తిథి : పాడ్యమి,

నక్షత్రం : హస్త, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. భూ సంబంధమైన చర్చలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వర్తించండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. మిత్రులు సహకారం ఉంటుంది. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రుల సహకారాలుంటాయి. శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల ప్రశంసలుంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయండి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మీ ఆలోచనలను కార్యరూపంలోకి తెస్తే అభీష్టం సిద్ధిస్తుంది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. మీ మాటకు గౌరవం లభిస్తుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వ్యాపారపరంగా ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. భవిష్యత్‌ అవసరాల కోసం చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలమవుతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు ఇబ్బందులతో కూడినటువంటి సమయం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో పని ఒత్తిడులుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. ఓర్పుతో ఆపదలను అధిగమించాలి. అసూయాపరుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఆంజనేయ స్వామిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మధ్యస్థ సమయం. ఆత్మీయుల సూచనలతో మేలు జరుగుతుంది. సహనంతో ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేసే పనులను వాయిదా వేయవద్దు. శక్తివంచన లేకుండా కృషి చేయండి. మొహమాటంతో రుణ సమస్యలు పెంచుకోవద్దు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. దేనికీ వెనకడుగు వేయవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతులు. ప్రతి అవకాశాన్నీ అదృష్టంగా మలుచుకోవాలి. పలుమార్గాల్లో విజయం లభిస్తుంది. అర్హతకు మించి ఏ ప్రయత్నం చేయవద్దు. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఆటంకాలుంటాయి. గృహ, వాహన కొనుగోలుకు అనుకూల సమయం. పెట్టుబడులు కలసివస్తాయి. చంచల నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికి మీ మంచిప్రవర్తన మీకు శక్తినిస్తుంది. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా అనుకూల సమయం. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ప్రశంసలుంటాయి. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. నూతన ప్రయత్నాలు కలసివస్తాయి. అనాలోచితంగా ఏ పనులూ చేయవద్దు. ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ప్రతిభతో మెప్పిస్తారు. ఆపద నుంచి బయటపడతారు. శుభవార్త వింటారు. ముఖ్య పనుల్లో విజయం ఉంది. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. తగిన కృషి చేయాలి. సంపదలు పెరుగుతాయి. ఉన్నత స్థితి గోచరిస్తుంది. తోటివారి సంపూర్ణ సహకారం అందుతుంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. ఒక కల సాకారం అవుతుంది. కుంభరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబసభ్యుల సలహాలు కలసివస్తాయి. ఆటంకాలు ఎదురైతే పట్టుదలతో పనిచేయాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓర్పు మిమ్మల్ని రక్షిస్తుంది. మొహమాటంతో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆపద నుంచి బయటపడతారు. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel