ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కాసేపు ఆలయంలో కూర్చుకుంటే మనసు తేలికపడుతుంది. ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే భగవంతునికి నైవేద్యాలు సమర్పించాలన్నా, ఆలయ హారతి చూడాలన్నా అన్నీ మనస్ఫూర్తిగా చేస్తాం. ఆలయం లోపల మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది, దీని వల్ల ప్రతికూల శక్తి అంతా క్షణాల్లో మాయమవుతుంది.
అదే సమయంలో ఆలయం నుంచి తిరిగివచ్చే సమయంలో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. కనుక మనం ఈ తప్పులు చేయకుండా ఉండాలి. మరి ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
తరచుగా మనం గుడిలో పూజలు చేసి తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రవేశద్వారం వద్ద గంట మోగిస్తాం. అలా చేయడం సరికాదు. ప్రవేశ సమయంలో గంట మోగించడం వల్ల మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, నెగిటివ్ ఎనర్జీ అంతా నశించిపోతుందని నమ్ముతారు. కనుక ఆలయానికి వెళ్ళేటప్పుడు మాత్రమే గంటను మ్రోగించాలి. తిరిగి వచ్చేటప్పుడు కాదు.
గుడికి వెళ్ళేటప్పుడు పూల దండలు, ధూపదీపాలు, స్వీట్లు వంటి అనేక వస్తువులను తీసుకెళ్తాం. అన్నీ దేవుడికి సమర్పిస్తాం. ఆలయం నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాకూడదు. కొన్ని పూలు, ప్రసాదం తీసుకురావాలి. శివుడికి నీటిని సమర్పించినట్లయితే అందులో కొంచెం ఇంటికి తీసుకురండి. ఆలయం నుండి ఖాళీ చేతులతో తిరిగి రావడం శుభప్రదంగా పరిగణించబడదు.
చాలా మందికి గుడి నుంచి రాగానే చేతులు, కాళ్లు కడుక్కోవడం అలవాటు. మీరు కూడా ఇలా చేస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. పాదాలు మురికిగా ఉంటే కాళ్ళు తుడుచుకోండి. కాళ్ళను మాత్రం వెంటనే కడుక్కోకూడదు.
కాసేపు ఆగి ఆ తరువాత కడుక్కోవచ్చు. నిజానికి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకుండా ఉంటే గుడిలోని పాజిటివ్ ఎనర్జీ మీలో ఎక్కువ సేపు ఉంటుంది. ఇది మిమ్మల్ని సానుకూలంగా ఉంచుతుంది. ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.