Ugadi Rasi Phalalu 2025: మకర రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆదాయం పెరుగుతుంది
Ugadi Rasi Phalalu 2025: మకర రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి? మకర రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు: శ్రవణం: ధనిష్ఠ 1,2 పాదాలు)
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా
గురుడు వృషభ రాశి సంచారంతో శుభకార్య ప్రయత్నాలు
గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
15.5.25 నుండి 19.10.25 నుంచి మిథునంలో ఉంటాడు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బందు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృ బాధలుండే అవకాశం వుంది.
20.10.25 నుండి 5.12.25 వరకు కర్కాటకంలో ఉంటాడు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
శని మీన రాశి సంచారంతో సంతోషం
శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
రాహువు మీన రాశి సంచారంతో మనోల్లాసం
రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
కేతువు కన్య రాశి సంచారంతో ఆటంకాలు
కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వటం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు వ్యాపారవిషయాలలో మార్పు కలుగును.
ఎవరికి ఎలా?
- మకరరాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును.
- మకరరాశి స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన.
- వాక్ స్థానములో రాహువు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి.
- శత్రువుల వలన సమస్యలు ఏర్పడును.
- శత్రు స్థానములో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును.
- రాజకీయనాయకులకు రాజకీయపరమైన ఒత్తిళ్ళు అధికమగును.
- ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును.
- రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది.
- సినీ రంగంలోని వారికి శుభఫలితాలు కలుగును.
- మీడియారంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలుగును.
దుర్గాదేవిని పూజించండి, గురు దక్షిణామూర్తి సోత్రాన్ని పఠించాలి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని మరియు దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి సోత్రాన్ని పఠించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవీ ఖడ్గమాల వంటి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభఫలితాలు పొందుతారు.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఇంట్లో సమస్యలు. ఏ పని తలపెట్టినా కలసిరాదు. ఉన్నత విద్యకు ఆటంకం. ఆందోళన, ఆస్వస్థత. దంపతుల మధ్య విరోధాలుంటాయి. సంతానమునకు కష్టములు. వ్యర్థపు ఆలోచనలు, వివాహ ప్రయత్నములు.
మే నెల
ఈ మాసం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వస్త్రములు, వాహనాలు కొంటారు. మంచి గౌరవముంటుంది. కొత్త ప్రయత్నములు కలసివచ్చును. దూరప్రాంతపు వ్యాపారాలు కలసివచ్చును. దానధర్మములు చేయుదురు. భూ, గృహ సమస్యలు అనుకూలించును.
జూన్ నెల
ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. మానసికాందోళన. మీ మీద మీకు నమ్మకం ఉండదు. ప్రయాణములలో సుఖము. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదము ఏర్పడుతును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. శుభకార్యములు.
జూలై నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములలో జయము. భయాందోళనలు. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. మంచి గౌరవము. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్రతములు, పూజలు చేయుదురు. గృహమార్పులు.
ఆగస్టు నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. వ్యాపారపరంగా లాభదాయకం. శరీరంలో అనుకోని మార్పులు, అనారోగ్య సమస్యలు. అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారములలో తిరుగుతారు.
సెప్టెంబర్ నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. శారీరక అలసట. ధన లాభముండును. వృథా ప్రయాణాలుంటాయి. గృహము లేక భూమి కొనుట. విధి నిర్వహణలో పొరపాట్లు. సంతాన సౌఖ్యము. వ్యాపారులకు లాభదాయకం.
అక్టోబర్ నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధన వ్యయముంటుంది. పనిలో ఉత్సాహం, మానసికానందము. పనికిరాని ఆలోచనలు చేస్తారు. పెద్దలతో తిరుగుదారు. స్నేహితులు మోసం చేయుదురు. కొత్తవారితో పరిచయాలుంటాయి. అలంకార ప్రాప్తి.
నవంబర్ నెల
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దానధర్మములు చేస్తారు. భార్యా భర్తల మధ్య విభేదాలుంటాయి. మానసికాందోళన. అధికార ఒత్తిడి. చేసే వృత్తి ఉద్యోగములో ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనములు చేస్తారు. ఆదాయం బాగుంటుంది.
డిసెంబర్ నెల
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘంలో గౌరవమర్యాదలు తగ్గును. రుణ సమస్యలుంటాయి. ధన నష్టం. మానసికాందోళన. ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానపరంగా సమస్యలుంటాయి. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
జనవరి నెల
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలసివచ్చును. విందులలో పాల్గొంటారు. దూర ప్రయాణాలుంటాయి. స్త్రీ విరోధములు. ఉత్సాహంగా ఉంటారు. మీ మాటలలో పెంకితనం. ఇంట్లో శుభములు. వాహన సౌఖ్యం.
ఫిబ్రవరి నెల
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆడంబరములకై ధనం ఖర్చు చేసెదరు. రుణ ప్రయత్నాలు చేస్తారు. గౌరవం తగ్గును. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు. అనారోగ్య సమస్యలు.
మార్చి నెల
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. దానధర్మాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ కలహాలేర్పడతాయి. కొన్ని విషయాలలో ఓడిపోతారు. ఆరోగ్యం సమస్యలు వచ్చును. కుటుంబములో వృథా ఖర్చులుంటాయి. గృహ మార్పులుంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం