వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక లాభాలను పొందవచ్చు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు దోషాల నుంచి కూడా బయటపడొచ్చు. ఎప్పుడూ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం, వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వంటివి ముఖ్యము.
కొన్ని పొరపాట్లు చేస్తే డబ్బులు వృధా అయిపోతాయి. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు చాలామంది తెలియక చేసే పొరపాటు గురించి తెలుసుకుందాం.
చెప్పులని విడిచిపెట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అనవసరమైన సమస్యలు కలగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవడం మంచిది.
వాస్తు ప్రకారం ముఖద్వారం వద్ద రాహువు ఉంటాడు. ముఖం ద్వారం దగ్గర ఎంత మురికిగా ఉంచుకుంటే రాహువు అంత దారుణమైన పరిస్థితుల్ని కలిగిస్తాడు. కాబట్టి, ముఖద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖద్వారం వద్ద చెప్పులు, షూ తో నింపేయకండి. అలా చేయడం వలన రాహువు సమస్యల్ని కలిగిస్తాడు. అనారోగ్య సమస్యలతో కూడా బాధపడాల్సి ఉంటుంది.
చెప్పులు, షూ ని ఎప్పుడూ కూడా సరిగ్గా పేర్చుకోవాలి. ముఖద్వారం దగ్గర అస్తవ్యస్తంగా పడడం లాంటివి చేయకండి. షూ ర్యాక్ ఉంటే షూ ర్యాక్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా పాటిస్తే ప్రతికూల శక్తి నుంచి బయటపడవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం