Mahabharata Facts: మహాభారతం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇవే-mahabharata facts only very few people know about these and everyone must know these ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mahabharata Facts: మహాభారతం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇవే

Mahabharata Facts: మహాభారతం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇవే

Peddinti Sravya HT Telugu
Dec 30, 2024 01:30 PM IST

Mahabharata Facts: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పురాణాలలో మహాభారతం ఒకటి. అయితే, మహాభారతం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఆరు వాస్తవాల గురించి ఇప్పుడు చూద్దాం.

Mahabharata Facts: మహాభారతం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇవే
Mahabharata Facts: మహాభారతం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవాలు ఇవే

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పురాణాలలో మహాభారతం ఒకటి. కురుక్షేత్ర యుద్ధం ధర్మం వైపు మొగ్గు చూపడం, కుటుంబ ద్రోహులు ఇలా ఎన్నో. అయితే, మహాభారతం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఆరు వాస్తవాల గురించి ఇప్పుడు చూద్దాం.

yearly horoscope entry point

1. అసలు పేరు

ఈ ఇతిహాసం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే వాస్తవం ఏంటంటే మహాభారతాన్ని మొదట్లో 'జయ' అని పిలిచేవారు. అంటే విజయమని అర్థం. ఈ ఇతిహాసం ధర్మం, మంచి చెడుల యుద్ధం, కౌరవుల మోసాలపై పాండవులు విజయం పై దృష్టి సారించినందున ఈ పుస్తకానికి జయ అని పేరు వచ్చింది. తరవాత మహాభారతంగా పేరు మార్చారు.

2. 16 సార్లు

ఇతిహాసాలు, కథలు, నమ్మకాల ప్రకారం హిందూమతంలో ఒక పాత్ర మహాభారత యుద్ధాన్ని, దాన్ని విభిన్న ఫలితాలని 16 సార్లు చూసింది. కాకి రూపంలో ఉన్న మహర్షి కక్భూషుండికి శివుడు ద్వారా కాలయాత్ర చేసే వరం పొందాడు. అతను 16 సార్లు మహాభారతాన్ని చూసాడు. విభిన్న ఫలితాలని చూసాడు. 11 సార్లు రామాయణాన్ని చూశాడు.

3. వేద వ్యాసుడు

మహాభారతాన్ని రచించారని వేద వ్యాసుడు ఈ గ్రంథ రచయితనే తరచుగా చెబుతూ ఉంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవం ఏంటంటే, వేదవ్యాసుడు అనేది పేరు కాదు. మహాభారత రచయిత వేద వ్యాసుడు ఒక వ్యక్తి పేరు కాదు. వేదాలని ఒకచోట చేర్చి వర్గీకరించిన బిరుదు. అయితే, ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయన. అతనికి ఉన్న జ్ఞానం, అతని పని వలన అతనికి వేద వ్యాసుడు అనే బిరుదు ఇవ్వబడింది.

4. కౌరవుల యుద్ధం

మహాభారత యుద్ధం పాండవులు, కౌరవుల మధ్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ, తన సోదరులతో పోరాడి, ధర్మ పక్షం వహించి, యుద్ధం అంతా శ్రీకృష్ణుడితో ఉన్న కౌరవుడు ఒకడన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ కౌరవుడు యుయుత్సుడు, ఒక పని మనిషికి జన్మించిన ధృతరాష్ట్ర కుమారుడు. ఈ సమయంలో పాండవుల పక్షం వహించిన ఏకైక కౌరవుడు.

5. అర్జునుడు వైపు ఇంకో దేవుడు

శ్రీకృష్ణుడు అర్జునుడికి సహాయం చేశాడని అతనితో పాటు రథసారథిగా ఉన్నాడని అందరికీ తెలుసు. అర్జునుడికి అతని రథానికి మద్దతుగా మరొక దేవుడు ఉన్నాడని చాలామందికి తెలియదు. హనుమంతుడు యుద్ధ సమయంలో అర్జునుడు రథం జెండాపై కూర్చున్నాడు. అర్జునుడు రధాన్ని కపిధ్వజ అని పిలిచేవారు.

6. యుద్ధం ఎలా మొదలైంది

మహాభారతం గురించి చాలా తక్కువ మందికి తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే ప్రతిరోజు ఒక నిర్దిష్ట శంఖం ఊదడంతోనే యుద్ధం మొదలయ్యేది. ప్రాచీన భారతీయ సంప్రదాయంలో యుద్ధాలు, శంఖం ఊదడంతో మొదలవుతాయి. కురుక్షేత్ర యుద్ధం ప్రతిరోజు శ్రీకృష్ణుని శంఖం పంచజన్యతో మొదలయ్యేది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner