మార్చి 8, నేటి రాశి ఫలాలు.. మహా శివరాత్రి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితం ఇస్తుందంటే-maha shivaratri today rasi phalalu march 8th check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Maha Shivaratri Today Rasi Phalalu March 8th Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 8, నేటి రాశి ఫలాలు.. మహా శివరాత్రి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితం ఇస్తుందంటే

HT Telugu Desk HT Telugu
Mar 08, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.03.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మహా శివరాత్రి, మార్చి 8 వ తేదీ రాశి ఫలాలు
మహా శివరాత్రి, మార్చి 8 వ తేదీ రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: శుక్రవారం, తిథి : త్రయోదశి,

నక్షత్రం : శ్రవణ, మాసం : మాఘము

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సహోదర, సహోదరి వర్గంతో మాట పట్టింపులేర్పడు అవకాశమున్నది. ఆస్తి వివాదాలు తీరతాయి. దూరప్రాంత ప్రయాణాలు కలసివస్తాయి. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్మాణ సంబంధమైన లోన్స్‌ లభిస్తాయి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. దూరపు బంధువులనుండి సలహాలు, సూచనలు తీసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో చొరవ తీసుకొని కొంతమంది వ్యక్తిగత విషయాల పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. అర్హత కలిగినటువంటి ఉన్నత పదవికి ఎంపిక అవుతారు. టీచింగ్‌ వృత్తిలో ఉన్నవారికి ప్రభుత్వ స్కూల్ నుండి మంచి అవకాశాలు వస్తాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. మంచి సంబంధాన్ని కుదుర్చుకుంటారు. చెప్పుడు మాటలు విని మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వాహన విషయంలో జాగ్రత్త వహించండి. అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్త్రీలతో భేదాభిప్రాయాల వల్ల కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. వివాహ విషయంలో చొరవ తీసుకుంటారు. అనుకున్న కార్యక్రమాల్లో పురోగతి సాధిస్తారు. విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీ ప్రయోజనాలను పరిరక్షించుకుంటారు. అందరిలో ఐకమత్యాన్ని తీసుకువస్తారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నవారి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించండి. టీచింగ్‌ వృత్తిలో ఉన్నవారికి అనుకూలం. శాంతిగా చర్చలను పరిష్మరించుకుంటారు. అతిథులకు తీపిపదార్జాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారాలలో స్వల్పమైన నష్టాలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రత్యక్షంగా వాస్తవాలను పరిశీలించి మంచి నిర్ణయాలు తీసుకోండి. తల్లి తరపు బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. సన్నిహితుల సహాయంతో వివాహ కార్యక్రమాలు ఘనంగా చేస్తారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆహార నియమాలు పాటించండి. స్నేహితుల సహకారంతో ఒక సమస్యని పరిష్కరించుకుంటారు. కొందరితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. మీరు అనుకున్న ఒక కార్యక్రమం మధ్యలోనే ఆపి వేయాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘ సేవా కార్యక్రమాలు, అనాధ శరణాలయాలకు విరాళాలు అందచేస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారపరంగా లాభదాయకం. గొడవలకు, విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. శాంతి, సహనం వహించటం మంచిది. ఆరోగ్య సలహాలు పాటించండి. సొంత వైద్యం పనికిరాదు. ఉద్యోగంలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. గృహ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలసి నూతన వ్యాపారంకై చర్చలు సాగిస్తారు. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్జాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విద్యా, వ్యాపార, ఉద్యోగపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతాన విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వివాహ, శుభ కార్య విషయాలలో అనుకోని విధంగా సమస్యలు ఎదురవుతాయి. వాటిని సమర్ధవంతంగా దాటడానికి అధికంగా శ్రమిస్తారు. కొంతమంది వ్యక్తులతో పరిచయాలు అనుకోని పరిమాణాలకు దారితీస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలసివస్తాయి. లోన్లు మంజూరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధువులతో, అయినవాళ్ళతో మాట పట్టింపులు వస్తాయి. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం సంపాదించుకుంటారు. ధన సంపాదన కోసం అహర్నిశలు కష్టపడతారు. అయితే శ్రమకు తగిన ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. నూతన అవకాశాలను అందుకుంటారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవుల్లో ఉన్న వారితో వేధింపులు తప్పకపోవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. స్త్రీలతో విరోధం. స్త్రీల సహాయ నిరాకరణ ఒక కార్యక్రమంలో చికాకు కలిగిస్తుంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పోలీసు శాఖలో ఉన్న వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel