శుక్రుడు సంపద, ఐశ్వర్యం, అందం, విలాసవంతమైన జీవితాన్ని అందిస్తాడు. శుక్రుడు శుభస్థానంలో ఉన్నట్లయితే ఆ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుతం శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఒకటి, నాలుగు, ఏడు, పది స్థానాల్లో ఉన్నట్లయితే మాలవ్య, మహాపురుష రాజయోగాలు ఏర్పడతాయి, ఇలా ఈ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే రాజయోగాలు ఏర్పడడం జరుగుతుంది.
దీంతో ఆరు రాశుల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మే 31 లోగా ఈ రాశుల వారి పంట పండినట్లే. శుక్రుడు ప్రభావంతో ఏయే రాశుల వారికి కలిసి వస్తుంది. ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వంటివి ఇప్పుడే తెలుసుకుందాం.
కన్య రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. విదేశాలకి వెళ్తారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది.
వృషభ రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. వీరికి లాభ స్థానంలో శని ఉన్నారు. దీంతో అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సంపద కలిగి సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు, ధన లాభం వంటివి చూస్తారు.
మిధున రాశి వారికి ఈ మార్పు =పేరు ప్రతిష్టలను తీసుకువస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సామాజికంగా ఆర్థికంగా కలిసి వస్తుంది.
మీన రాశి వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీరుతాయి. వృత్తి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉన్నత స్థానంలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం బాగుంటుంది.
కుంభరాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాలు జరుపుతారు. ధన లాభం కలుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ధనస్సు రాశి వారికి సమస్యలు తీరిపోతాయి. సొంత ఇంటి కోసం చూస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధనస్సు రాశి వారు శుభకార్యాలు జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం