Kumbh Mela: మహాకుంభమేళా 2025లో కనపడే 6 అత్యంత ప్రసిద్ధ అఖారాలు, వారి ప్రాముఖ్యత తెలుసుకోండి
Kumbh Mela: భారతదేశంలో ఆక్రమదారులు, దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అఖారాలు, సాధువులు హిందూ విశ్వాసాన్ని రక్షించడానికి వారి దంతాలు, గోర్లతో పోరాడారని చెప్తారు. మహా కుంభమేళలో కనపడే ఆరు అత్యంత, ప్రసిద్ధ అఖారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మహా కుంభమేళా అనేది జీవితంలో ఒక్కసారి చూసే కార్యక్రమం. 2025 మహా కుంభమేళా 144 ఏళ్లకు వచ్చేది. పూర్ణ, అర్ధ కుంభానికి భిన్నంగా మహా కుంభమేళా ఉంటుంది. ఇది ప్రత్యేకమైనది. శక్తితో నింపుతుంది. లక్షలాదిమంది భక్తులు, సాధువులు, సన్యాసులు ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళలో స్నానాల చేస్తారు.

ఈ కుంభమేళాలో ప్రత్యేకంగా నిలిచే అఖారాల గురించి తప్పక ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. భారతదేశంలో ఆక్రమదారులు, దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అఖారాలు, సాధువులు హిందూ విశ్వాసాన్ని రక్షించడానికి వారి దంతాలు, గోర్లతో పోరాడారని చెప్తారు. మహా కుంభమేళలో కనపడే ఆరు అత్యంత, ప్రసిద్ధ అఖారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.జున అఖారా
వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందిన పురాతమైన అఖారాలు. వీళ్ళు శైవ సంప్రదాయానికి చెందిన వారు. శివుడుని రక్షకుడిగా, పరిరక్షకుడిగా ఆరాధిస్తారు. నాగ సాధువులకు ప్రసిద్ధి చెందారు. ఒంటిపై బూడిదను పూసుకుంటారు. కొన్నిసార్లు శరీరంపై ఒక్క వస్త్రం తప్ప ఇంకేమీ ఉండదు.
2. నిరంజని అఖారా
నిరంజని అఖారా సాధువులు ఆధ్యాత్మిక మేధోజ్ఞానోదయం పై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత, అభ్యాసం, సామాజిక కారణాలు ఇంకా ఎన్నో వాటిల్లో నిష్ణాతులైన సాధువులని వీళ్ళు తీసుకు వస్తారు. సన్యాసం గురించే కాదు జ్ఞానం, గ్రంధాల అధ్యయనం, బోధన గురించి కూడా వీరు చెప్తారు.
3. మహానిర్వాణి అఖారా
ధ్యానం, యోగా, స్వీయ క్రమశిక్షణకు సంబంధించినది ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా ఆత్మ అంతర్గత ప్రయాణం పై దృష్టి పెడతారు. వీరి సమూహం ఆదిశంకరాచార్యులచే నిర్వహించబడిందని.. కపిల మహామునిచే స్థాపించబడిందని చెప్తారు.
4. అటల్ అఖాడా
వీళ్ళు కూడా శైవ సంప్రదాయాన్ని పాటిస్తారు. మహా కుంభ సమయంలో అఖారా సాధువులు ఆచారాలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. వినయం, భక్తితో వీరు జీవిస్తారు.
5. నిర్మోహి అఖాడా
వీళ్ళు విష్ణువుని ఆరాధిస్తారు. నిర్మోహి అఖారా సన్యాసులు శ్రీరాముని పట్ల భక్తికి ప్రసిద్ధి చెందారు. రామాయణ బోధనలతో జీవిస్తారు. భారతదేశంలో రామ మందిర ఉద్యమంలో కూడా భాగం అయ్యారు.
6. నాగ్ పంతి గోరఖ్ నాధ్ అఖారా
నాధ్ సంప్రదాయంలో ఒక భాగం. శైవమతం, యోగా, తంత్ర సంప్రదాయాలను నమ్ముతారు. యోగి అయిన గురు గోరఖ్నాథ్ వంశానికి చెందిన వారు. యోగా, సన్యాసి అభ్యసల పట్ల అంకితభావానికి వీరు ప్రసిద్ధి చెందారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం