ప్రతి 12 ఏళ్ళ తర్వాత ప్రయాగ్‌రాజ్ లో మహాకుంభమేళాను నిర్వహిస్తారు. కుంభస్నానం చేయడం వల్ల మీ పాపాలన్నీ హరిస్తాయని నమ్ముతారు. అందువల్ల, మీరు మీ జీవితాంతం ఒకసారి కుంభస్నానం చేయాలి.
మహాకుంభమేళా ఈసారి ప్రయాగ్ రాజ్ లో జరగబోతోంది. జనవరి 13న పుష్య పూర్ణిమ నుంచి మొదలై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు ఇది కొనసాగుతుంది.
ప్రపంచం నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కుంభమేళాకి వస్తారు. మహా కుంభమేళా మతం, ఆధ్యాత్మిక, సంస్కృతి యొక్క మహాకుంభంగా పరిగణించబడుతుంది.
ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రయాగ్ రాజ్ లో జరిగే మహాకుంభమేళా పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం దగ్గర జరుగుతుంది. దీన్ని ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం మహా కుంభంలో స్నానం చేయడం వలన మోక్షం లభిస్తుంది.
మహా కుంభమేళలో మొదటి రాజస్నానం ఎవరు చేస్తారు అనే దాని గురించి చాలా మందికి తెలియదు. మహా కుంభమేళలో మొదటి రాజ స్నానం నాగ సాధువులు చేయాలి. వీళ్ళే మొదట స్నానం చేయాలి. ప్రముఖ సాధువులు ముందుగా స్నానం చేస్తారు. మహాయోధ సాధువులు అని వీరిని పిలుస్తారు.
ఎందుకంటే పురాతన కాలంలో వారు మతం సమాజాన్ని రక్షించడానికి సైన్యంగా వ్యవహరించేవారు. నాగ సాధువులు స్నానం చేశాక అక్కడికి వచ్చే పర్యటకులు త్రివేణి లో స్నానం చేస్తారు. హిందూమతంలో కుంభ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఒకసారైనా కుంభ స్నానాన్ని చేయాలి.
కుంభమేళాలో జరిగే రాజస్నానంలో ప్రత్యేక పాత్ర పోషించేది నాగ సాధువులు. అఖారాలలో ప్రధాన తరగతికి చెందినవారు వీళ్ళు. నగ్నంగా ఉంటారు. శరీరంపై బూడిద పూసుకుంటారు. నాగ సాధువులు వారి కష్టమైన తపస్సు సంయమానికి ప్రసిద్ధి చెందారు. వీరు మొదట రాజస్థానం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన సాధువులు, సాధారణ ప్రజలు స్నానమాచరిస్తారు.
నాగ సాధువులు కుంభమేళలో ముందుగా రాజస్నానం చేస్తారు. కుంభమేళాలో వారికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణ ప్రజలు స్నానం చేసాక వీళ్ళు స్నానం చేసిన తర్వాత మాత్రమే స్నానం చేస్తారు.
కాబట్టి కుంభమేళా స్నానానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలని కచ్చితంగా గుర్తు పెట్టుకొని ఆచరించండి. కుంభమేళాలో స్నానం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం వస్తుంది.
సంబంధిత కథనం