మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా, 'సూర్య జయంతి'గా జరుపుకుంటారు –చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
సూర్యుడు కుంభ సంక్రమణం చేసే మాసం శ్రీలక్ష్మీనారాయణులకు, ఉమామహేశ్వరులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలోనే శ్రీపంచమి, రథసప్తమి, మహాశివరాత్రి, బీష్మాష్టమి మొదలైన పండుగలు వస్తాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూర్త్యాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవత రించిన రోజుగా, 'సూర్య జయంతి'గా జరుపుకుంటారు.

దానినే రథ' సప్తమి' అంటారు. మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, భౌతిక, ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చే వానిగా భావించింది.'మఖ' నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల మాసం మాఘ మాసం. 'అఘం' అనగా పాపం. 'మ' అనగా పోగొట్టేది పాపాలను నశింపచేసేది మాఘ మాసం.
సూర్యుడు కుంభ సంక్రమణం చేసే మాసం శ్రీలక్ష్మీనారాయణులకు, ఉమామహేశ్వరులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలోనే శ్రీపంచమి, రథసప్తమి, మహాశివరాత్రి, బీష్మాష్టమి మొదలైన పండుగలు వస్తాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భారతదేశం ధర్మ ప్రధానమైన దేశం. కనుక ఇక్కడ ధార్మికపరమైన కర్మలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. భారతీయ సనాతన ధర్మంలో మనం పాటించే సంప్రదాయా లకు ఆచారాలకు కార్యకారణ సంబంధ ముంది. హైందవ సంస్కృతిలో నిర్వ హించే ఆరాధనా ప్రక్రియలు అన్నింటా విశ్వశ్రేయో భావనలు అభివ్యక్తమవు తాయి. సత్సంకల్పం, క్షమ, దయ, దాన, శౌచం మున్నగునవి ఆచరించినప్పుడే పుణ్య ప్రాప్తి కలుగుతాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలోను ఆచారాలలోను సామాజిక ప్రయోజనం అడుగడుగునా ప్రస్థుటమవుతుంది. మాఘ మాసంలో వచ్చే శుక్ల సప్తమిని రథసప్తమి అని వ్యవహ రిస్తారు. సూర్యోపాసకులకు ఈ రోజు పవిత్రమైంది. మనకు ప్రతి రోజు దర్శనమిచ్చే ప్రత్యక్షదైవం సూర్యుడు.
ఈ సకల చరాచర జగత్తు సూర్యుని కరుణాకటాక్షాల వల్లనే మనగల్గుతోంది. తిమిరాన్ని పారద్రోలి వెలుగును నింపే గ్రహరాజైన సూర్యభగ వానుణ్ణి అవతార స్వరూపమైన సూర్యనారాయణమూర్తిగా పూజిస్తారు. ఈ సూర్యనారాయణ మూర్తి త్రిమూర్తి స్వరూపునిగా, వేద స్వరూపునిగా, కర్మసాక్షిగా కొలవబడుతున్నాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ సూర్యభగవానుడు జ్ఞానప్రదాత, ఆరోగ్యప్రదాత. అంధకారాన్ని తొలగించి వెలుగును, ప్రాణవాయువును, దివ్యత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న దేవాధిదేవుడు, తేజోమూర్తి. సూర్యారాధన వల్ల ముఖ్యంగా రోగ నివారణ, మంచి ఆరోగ్యం సమ కూరుతాయి. సూర్య నమస్కారాలు మన దేహంలో జీవనాడులను ఉద్దీపింప చేసి, ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నాయి. మన ప్రాచీన ఋషులు, యోగాసనం, ప్రాణాయామం, మంత్ర ముద్రల సహితంగా రూపొందించిన అద్భుత ప్రక్రియ సూర్యనమస్కారాలు.
ఉషోదయ కాలంలో మంత్రపూర్వకంగా సూర్య నమస్కారాలు, ఆసనాలు సూర్యునికి అభిముఖంగా చేసిన మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. శరీరం వజ్రతుల్యం అవుతుంది. ఉషఃకాలంలో గాలిలో ప్రాణవాయువు అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు ప్రాణశక్తి సమకూరి మంచి ఆరోగ్యవంతులుగా తయారుచేస్తుంది. ఓంకార పూర్వక సూర్య నమస్కారాలు ఆరోగ్యప్రదాతలు. సూర్య నమస్కారాల వల్ల దీర్ఘాయుష్షు, మేధస్సు, బలం, వీర్యం చేకూరుతాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుని సృష్టిం చాడు. కావున ఆ రోజు సూర్య జయంతిగా రథసప్తమి, సౌర సప్తమి అంటారు. రవి మకరరాశిలో ప్రవేశించిన నాటి నుంచి ఉత్తరాయనం ప్రారంభమవుతుంది. అప్పుడు సూర్యుడు సప్తాశ్వరథారూఢుడై సర్వలోక చైతన్యప్రదుడై దక్షిణ దిక్కుని వదిలి ఉత్తర దిక్కుకు ప్రయాణం సాగించడానికి ఉపక్ర మిస్తాడు. ఈ పర్వదినాన్ని రథసప్తమి అంటారు. ఈనాటి నుంచి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం