ప్రకృతి కొండల నడుమ, గలగలపారే సెలయేరు పక్కన వెలసిన శ్రీ మద్దులేటి నరసింహస్వామి దేవస్థానం ప్రముఖ వైష్ణవక్షేత్రంగా విరాజిల్లుతోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆలయ స్థలపురాణం ప్రకారం ఒకరోజు శ్రీ స్వామి, అమ్మవార్లు ఆనందంగా పాచికలు ఆడుతున్నారు.
శ్రీ స్వామివారిపై అమ్మవారు విజయం సాధించి, విజయగర్వంతో స్వామివారివంక చూశారు. అందుకు స్వామి అలకబూని, ఎర్రమల, నల్లమల కొండలు సంచరించి చివరకు శ్రీ యాగంటి క్షేత్రానికి వచ్చి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని సంప్రదించి, అయ్యా! నేను ఎర్రమల కొండలలో వెలసి భక్తుల కోర్కెలు తీరుద్దామనుకుంటున్నాను, నాకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించండి" అని కోరారు.
యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామివారు మద్దులేరు వాగు పక్కన ప్రకృతి రమణీయ ప్రశాంత వాతావరణ ప్రదేశం నీకు అనుకూలమని సూచించారు. స్వామివారు ఈ ప్రాంతంలో ఉండటానికి నిశ్చయించుకొని, పద్దులేరుకు 3 కి.మీ. దూరంలో గల మోక్షపట్టణాన్ని పరిపాలించే రాజు కుప్పదొర, ఒక శనివారం నాడు వేటకు వెళ్ళిన సమయంలో తళతళా పెరుస్తూ ఒక బంగారు ఉడుము ఆకారంలో కనిపించాడు. రాజు తన భటులతో ఆ ఉడుమును పట్టుకోవడానికి ఎంత ప్రయత్నిం మా సాధ్యపడలేదు.
చేసేదేమీ లేక రాజు వెనుదిరగగా, అదే సమయానికి ఉడుము కోమలి అనే పుట్టలోకి ప్రవేశించింది. అప్పుడు రాజు ఆ పుట్టను తవ్వి, ఎలాగైనాసరే ఆ ఉడుమును పట్టుకోమని భటులను ఆదేశంచాడు. అయితే భటులు పుట్టను తవ్వి ఎంత ప్రయత్నించినా దొరకలేదఅని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అదే రోజు రాత్రి రాజుకు కలలో స్వామివారు కనిపించి, "నేను ఈ ప్రాంతంలో నివాసం ఉండదలిచాను. ఈ రోజు ఉదయం నీకు బంగారు ఉడుము రూపంలో కనిపించి, పుట్టలోకి వెళ్ళిపోయాను మీరు పుట్ట దగ్గరకు వచ్చి పూజిస్తే, మీకు పదేళ్ళ బాలుడిరూపంలో కనిపిస్తాను. నాకు ప్రతి నిత్యం పూజలు జరిగేలా చూడండి" అని ఆనతిచ్చారు.
రాజు ఎంతో సంతోషపడి, మర్నాడు ఉదయం మంగళవాయిద్యాలతో మోక్షపురి ప్రజలతో సహా ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి, స్వామివారు చెప్పినచే భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీస్వామివారు బాలుడి రూపంలో దర్శనమిచ్చి మద్దులేరు వాగు పక్కన శిలా రూపంలో వెలిసారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000