Lucky zodiac signs: రెండు అద్భుతమైన యోగాలతో.. ఈ రాశుల వారికి వసంత పంచమి అదృష్టం తీసుకురాబోతుంది
Lucky zodiac signs: ఈ ఏడాది వచ్చిన వసంత పంచమి మరింత ప్రత్యేకత సంతరించుకోబోతుంది. గజకేసరి యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడనున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది.

Lucky zodiac signs: ఫిబ్రవరి నెలలో గ్రహాల కదలికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఈ నెలలో పెద్ద గ్రహలైన సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు వంటివి తమ రాశి చక్రాలు మార్చుకుంటూ అనేక శుభ యోగాలు సృష్టిస్తూ వచ్చాయి. ఫిబ్రవరి నెల మాఘ మాసంలో అనేక పండుగలు వచ్చాయి.
మాఘ మాసం శుక్ల పక్షం ఐదో తిథిన వసంత పంచమి జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి వచ్చింది. ఈరోజు సరస్వతీ దేవిని పూజించి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పిస్తారు. పిల్లలకు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయించడం శుభప్రదంగా భావిస్తారు.
ఈరోజు అనేక శుభ యోగాలు, నక్షత్రాలు ఏర్పడటం వల్ల వసంత పంచమి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. పంచాంగం ప్రకారం వసంత పంచమి నాడు అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రం కలిసి వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు శుక్రుడు, కుజుడు, బుధుడు కలయిక వల్ల రవి యోగం, త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో మేష రాశిలో దేవ గురువు బృహస్పతి, చంద్రుడు కలయిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రవి యోగం వల్ల విజయం, శ్రేయస్సు లభిస్తాయి.
వసంత పంచమి నాడు త్రిగ్రాహి యోగం, గజకేసరి యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. సరస్వతీ దేవి అనుగ్రహంతో పాటు ఈ యోగాల వల్ల శుభ ఫలితాలు పొందబోయే రాశులు ఏవంటే..
మేష రాశి
వసంత పంచమి నాడు గురు, శుక్రుడు, కుజుడు, బుధుడు, చంద్రుల కదలికల వల్ల మేష రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తాయి. ఆర్థిక పురోభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తి కలిసి వస్తుంది. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసే వారికి అదనపు బాధ్యతలు అందుతాయి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇబ్బందులని సులభంగా అధిగమిస్తారు. ప్రేమ జీవితం రొమాంటిక్ గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది.
మిథున రాశి
త్రిగ్రాహి యోగం, గజకేసరి యోగం వల్ల మిథున రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేసే పోరాటానికి ప్రతిఫలం దక్కుతుంది. పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ట్రిప్ కూడా వెళతారు.
వృశ్చిక రాశి
వసంత పంచమి నాడు త్రిగ్రాహి యోగం, గజకేసరి యోగం ఏర్పడటం శుభప్రదం. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించేందుకు ఇది శుభ సమయం. వ్యాపారంలో కొత్త డీల్ చేసుకుంటారు. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక, మత పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.
సంబంధిత కథనం
టాపిక్