వినాయకుడికి ఈ ఐదు రాశుల వారంటే ఎంతో ఇష్టం.. మట్టిని తాకినా బంగారంగా మారిపోతుంది!-lord vinayaka 5 favourite rasis these will always live happily with his blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వినాయకుడికి ఈ ఐదు రాశుల వారంటే ఎంతో ఇష్టం.. మట్టిని తాకినా బంగారంగా మారిపోతుంది!

వినాయకుడికి ఈ ఐదు రాశుల వారంటే ఎంతో ఇష్టం.. మట్టిని తాకినా బంగారంగా మారిపోతుంది!

Peddinti Sravya HT Telugu

వినాయకుడు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఆశీస్సులు ఇస్తారు. దీనితో ఈ రాశుల వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వినాయకుని అనుగ్రహంతో దేనికీ లోటే ఉండదు. మేష రాశి నుంచి మకర రాశితో పాటు ఈ రాశుల వారికి వినాయకుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

ఈ రాశుల వారికి వినాయకుని ఆశీస్సులు ఉంటాయి (pixabay)

ఏ పనిని మొదలుపెట్టిన మొట్టమొదట మనం వినాయకుని ఆరాధిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతాము. వినాయకుడు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఆశీస్సులు ఇస్తారు. దీనితో ఈ రాశుల వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.

వినాయకుని అనుగ్రహంతో దేనికీ లోటే ఉండదు. మేష రాశి నుంచి మకర రాశితో పాటు ఈ రాశుల వారికి వినాయకుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

ఈ రాశుల వారికి వినాయకుని ఆశీస్సులు ఉంటాయి

1.మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు, వినాయకుడితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటాడు. మేష రాశి వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు ఉండడం వలన కెరీర్ లో కూడా సక్సెస్ ను అందుకుంటారు. వ్యాపారంలో కూడా భారీగా లాభాలను పొందుతారు. వినాయకుడికి బెల్లంతో చేసిన మోదకాలను సమర్పిస్తే మంచిది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి కూడా వినాయకుని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారు వినాయకుని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. కెరీర్ లో, వ్యాపారంలో కూడా సక్సెస్ అందుకుంటారు. పని ప్రదేశంలో గౌరవాన్ని పొందుతారు. వినాయకునికి బుధవారం నాడు గరికతో పాటు మోదకాలను సమర్పిస్తే మంచిది.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కూడా వినాయకుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వినాయకుడికి బుధవారం నాడు మోతీచూర్ లడ్డూని సమర్పిస్తే, వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సంతోషంగా ఉండొచ్చు.

4.మకర రాశి

మకర రాశికి అధిపతి శని దేవుడు. మకర రాశి వారు ఎప్పుడూ వినాయకుని ఆశీస్సులతో సంతోషంగా ఉండవచ్చు. మకర రాశి వారు ఇబ్బందుల్లో పడినప్పుడు వినాయకుడు వాటిని తొలగిస్తాడు. సక్సెస్ ను అందుకుంటారు. వినాయకుడికి బుధవారం నాడు మోదకాలను సమర్పిస్తే మంచిది.

5.కుంభ రాశి

కుంభ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభ రాశి వారికి కూడా గణపతి ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. గణపతికి ఈ రాశి వారు ఎంతో ఇష్టం. ఈ రాశి వారు సక్సెస్ ను అందుకుంటారు, చాలా డబ్బులు సంపాదిస్తారు. ఈ రాశి వారు గులాబీ పూలను వినాయకుడికి సమర్పిస్తే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.