Lord Ganesh Slokas : గణేశుడి శ్లోకాలు, మంత్రాలు.. పూజ సమయంలో తప్పక పఠించాలి
Lord Ganesh Slokas : గణేశుడిని పూజిస్తే.. విఘ్నాలు తొలగి.. జీవితంలో ముందుకు వెళ్తారు. గణనాథుడిని ప్రసన్నం చేసుకుంటే.. బుద్ధిజ్ఞానాలు, కార్య సిద్ధి, గొప్ప విజయం సొంతమవుతుంది. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పూజ సమయంలో కొన్ని మంత్రాలు, శ్లోకాలు చదవాలి. ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు మెుదలయ్యాయి. గణనాథుడి సేవలో ప్రజలు మైమరిచిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. భాద్రపద మాసంలో వచ్చే మొదటి శుక్ల చతుర్థిని వినాయక చవితిగా వేడుక నిర్వహిస్తారు. గణేశ పురాణం, స్కంద పురాణాల ప్రకారం గణేశుడు ఈరోజునే జన్మించాడని అంటారు. అత్యంత వైభవంగా గణేశ మహోత్సవాలు నిర్వహిస్తారు. జ్ఞానం, విజయం, శ్రేయస్సుకు అధిపతిగా గణేశుడు ప్రసిద్ధి. సకల విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటాడు.
ఏ పూజ జరిగినా.. మెుదట గణనాథుడి పూజతోనే మెుదలవుతుంది. ప్రతి హిందువు ఇంట్లో గణేశుడి చిత్రం ఉంటుంది. వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు తప్పక పఠించాలి.
శివ పురాణం ఆధారంగా చూస్తే.. వినాయకుడికి శుభ్, లాభ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే వీరు శుభం, లాభానికి ప్రతీకలు. వీరిలో రిద్ధి దేవి కుమారుడు శుభ్ కాగా, సిద్ధి దేవి కుమారుడు లాభ్ అని పురాణాల్లో ఉంది. అందుకే వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే బుద్ధిజ్ఞానాలు, ఎలాంటి ఆటంకాలు లేని కార్య సిద్ధి, విజయం, సంపదలు వస్తాయని నమ్ముతారు. గణేశుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఇక్కడ కొన్ని శ్లోకాలు, మంత్రాలు ఉన్నాయి. వాటిని మీకోసం అందిస్తున్నాం. ఈ మంత్రాలను జపించండి.
శుభం చేకూర్చే గణేశ మంత్రం
వక్రతుండ మహా-కాయ సూర్య-కోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా సర్వ-కార్యేషు సర్వదా
ఆశీర్వాద మంత్రం
గజాననం భూత గణాధి సేవితమ్
కపిత్త జంబుఫలసార భక్తితం
ఉమా సుతం శోక వినాశ కరణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజం
మూల మంత్రం- శక్తి కోసం
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద్ సర్వజన్ జన్మయ్ వశమనయే స్వాహా
తత్పురుషయే విద్మహే
వక్రతుండయే ధీమహి
తన్నో దంతి ప్రచోద్యాత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
సిద్ధి వినాయక మంత్రం
ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే
సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్
సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా
గణేశ గాయత్రీ మంత్రం
ఓం ఏకదంతాయ విద్యామహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి ప్రచోదయాత్
ఈ మంత్రాలు స్వచ్ఛమైన మనసుతో పఠించాలి. మంచి ఆలోచనలతో సకల శుభాలు కలగాలని వేడుకోవాలి. ధ్యాన ముద్రలో మనసులో పఠించడం లేదా జపించడం చేయాలి. ఇలా చేస్తే.. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బుద్ధిజ్ఞానం పెరుగుతుందని నమ్మకం. విఘ్నాలు తొలగిపోతాయి. సంపద పెరుగుతుందని నమ్మకం.